Pebble Game Of Thrones Smartwatch: స్పెషల్ ఎడిషన్ ఎలక్ట్రిక్ వస్తువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని టెక్ కంపెనీలు స్పెషల్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు వాచ్‌లను తయారు చేసేందుకు అసక్తి చూపుతున్నాయి. స్వదేశీ ప్రముఖ వాచ్‌ల తయారీ కంపెనీ పెబుల్ తమ స్పెషల్ ఎడిషన్ వాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. కంపెనీ ఈ స్మార్ట్ వాచ్‌ను "గేమ్ ఆఫ్ థ్రోన్స్" అనే నామకరణంతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ వాచ్‌లో ఇంత ముందు విడుదల చేసిన వాచ్‌ల ఫీచర్స్ కంటే భిన్నంగా ఉంటాయి. డిజైన్ పరంగా ఎంతో ఆకర్శనీయంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ స్మార్ట్ వాచ్‌కి సంబంధించిన మరిన్ని ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పెబుల్ తమ కొత్త ఎడిషన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్ వాచ్‌లో అనేక రకాల కొత్త ఫీచర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాచ్ 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్ రౌండ్ డయల్‌తో పాటు లెదర్ స్ట్రాప్‌తో వస్తుంది. ప్రయాణాలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్మార్ట్‌వాచ్ నుంచే కాల్ చేసుకునేందుకు బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు స్పోర్ట్స్ ట్రాకింగ్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ వాచ్‌కు ఏడు రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ కూడా లభిస్తుందని కంపెనీ పేర్కొంది.
పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్‌వాచ్ ధర:
ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పెబుల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ వాచ్ రూ. 5,499లకు విక్రయిస్తోంది. ప్రస్తుతం పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్‌వాచ్ బ్లాక్, గ్రే, గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో కంపెనీ విడుదల చేసింది.
పెబుల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాచ్ ఫీచర్స్:
గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్మార్ట్‌వాచ్‌లో లెదర్ స్ట్రాప్‌తో పాటు రౌండ్ డయల్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.43 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో పాటు ఏ సమయంలోనైన ఆన్ మోడ్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్ట్‌తో పాటు iOS, Android స్మార్ట్‌ఫోన్స్ కనెక్టీవిటీతో పని చేయగలగుతుంది. దీంతో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్ ఈ వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి