Personal Cooler Vs Desert Cooler: ప్రస్తుతం భారత్‌లో వేసవి కాలం ప్రారంభమైంది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ తీవ్ర ఉష్ణోగ్రతలు తట్టుకోలేక చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ ఎండల, తేమల నుంచి శరీరాన్ని రక్షించుకునేందుకు తప్పకుండా చల్లని గాలిని అందించే కూలర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల సులభంగా వేడి గాలుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరం ఉష్ణోగ్రతలు కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి తప్పకుండా కూలర్స్‌ను వినియోగించాలి. దీని కోసం మేము అందిచే చిట్కాలను పాటిస్తే తప్పకుండా వినియోగించండి.
ప్రస్తుతం మార్కెట్‌లో పర్శనల్ కూలర్స్‌తో పాటు డెసర్ట్ ఎయిర్ కూలర్ కూడా ఉన్నాయి. వీటి రెండిటిలో చాలా ప్రత్యేకతలున్నాయి. వీటి నుంచి గాలి ఒక్కో సమయంలో ఒక్కో రకంగా వస్తుంది. మీరు ఎలాంటి ఎయిర్ కూలర్‌ను చూస్ చేసుకుంటే సమ్మర్‌లో మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మేము మీకు తెలపబోతున్నాం..
పర్శనల్ కూలర్స్ Vs డెసర్ట్ ఎయిర్ కూలర్ (Personal Cooler Vs Desert Cooler)
ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో ఎయిర్ కూలర్స్ డెడ్ ఛీప్‌గా లభిస్తున్నాయి. వాటితో కూడా సమ్మర్‌లో చల్లని గాలిని పొందొచ్చు. ఎఫెక్టివ్ కూలింగ్ కోసం తప్పకుండా పలు రకాల టిప్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అయితే చిన్న గదులున్నవారు కేవలం పర్శనల్ కూలర్స్ వినియోగించాల్సి ఉంటుంది. పెద్ద గదులు, హాల్స్ ఉన్నవారు డెసర్ట్ ఎయిర్ కూలర్ వినియోగించాలి. 150sqft నుంచి 300sqft గదుల వరకు చిన్న కూలర్స్‌ను వినియోగించవచ్చు.
వాటర్ ట్యాంక్ కెపాసిటీ:
ఎయిర్ కూలర్లలో వాటర్ ట్యాంక్ సామర్థ్యం కూడా ప్రధాన అంశమే..కూలర్ పరిమాణం పెద్దగా ఉంటే, ట్యాంక్ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. చల్లగాలిని పొందడానికి అధిక సామర్థ్యంతో కూడిన ఎయిర్ కూలర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న గదులున్నవారు, షాప్స్ ఉన్నవారు కేవలం 15 లీటర్ల నుంచి 25 లీటర్ల సామర్థ్యంతో కూడిన కూలర్స్‌ను కొనుగోలు చేయడం మంచిది.
కూలర్‌ను ఎలాంటి ప్రదేశాల్లో ఉంచాలో తెలుసా?:
మంచి గాలి పోయేందుకు తప్పకుండా గది కిటికీల బయట కూలర్ ఉంచాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల గది మొత్తం కూలింగ్ అవుతుంది. అంతేకాకుండా మీరు సులభంగా చల్లని గాలిని పొందొచ్చు.
ఇది కూడా చాలా ముఖ్యం:
డెసర్ట్ ఎయిర్ కూలర్స్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైన గదిని చల్లగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. టవర్ కూలర్లు తేమతో కూడిన ప్రాంతాలను మరింత ప్రభావవంతంగా ఉంచుతుంది. కాబట్టి పర్శనల్ కూలర్స్ కంటే డెసర్ట్ ఎయిర్ కూలర్లను కొనుగోలు చేయడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook