Poco Pad: Poco నుంచి కొత్తగా POCO PAD 5G లాంచ్ అయింది. ఇండియాలో త్వరలో లాంచ్ కానున్న ఈ ప్యాడ్ మార్కెట్లో క్రేజ్ సంపాదిస్తోంది. ప్రస్తుతం పోకో ప్యాడ్ వైఫై వేరియంట్ అందుబాటులో ఉండగా త్వరగా 5జి వేరియంట్ లాంచ్ కానుంది. పోకో ప్యాడ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
POCO PAD 5G 12.1 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. 2560/1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. రెడ్మి ప్యాడ్ ప్రో జికు ఇది రీ బ్రాండెడ్ వెర్షన్ కానుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జనరేషన్ 2 చిప్సెట్తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ కలిగి ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. షియోమీ హైపర్ ఓఎస్ కలిగి ఉంటుంది. పోకో ప్యాడ్ 16 : 10 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది.
Poco Pad 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి 10000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. దాంతో బ్యాటరీ లైఫ్ ఎక్కువసేపు ఉంటుంది. ఇక కెమేరా విషయానికొస్తే 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉన్నాయి. పోకో ప్యాడ్ ధర ప్రస్తుతం 27,500 రూపాయలుగా ఉంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ ప్యాడ్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
Also read: Personal Loan: అతి తక్కువ వడ్డీ రేట్లకే పర్సనల్ లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook