Xiaomi 14T Features, Specifications: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షావోమీ త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని Xiaomi 14T ప్రో మోడల్లో విడుదల చేయబోతున్నట్లు చైనా వార్త సంస్థలు వెల్లడించాయి. లాంచింగ్‌కి ముందే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ లీక్ అయ్యాయి. అయితే ఈ మొబైల్ ఇటీవలే విడుదలైన 13T ప్రోకి సక్సెసర్‌గా రాబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం..Xiaomi 14T ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రీమియం డిస్ల్పేతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవలే కొంతమంది టిప్‌స్టర్స్ కూడా ఈ మొబైల్‌పై స్పందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ మొదటి వారంలో రాబోతున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా GSMchinaలో ఈ మొబైల్‌కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా వెల్లడించారు. అలాగే దీనికి సంబంధించిన మోడల్స్‌ను IMEI డేటాబేస్‌లో కూడా పేర్కొన్నారు. ఈ Xiaomi 14T ప్రో స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ లాంచింగ్‌లో భాగంగా 2407FPN8EG, 2407FPN8ER మోడల్స్‌లో రానుంది. ముందుగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ జపాన్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. చైనాలో మాత్రం 2407FRK8EC మోడల్లో లాంచ్ చేసే ఛాన్స్ ఉందని కొందరు టిప్‌స్టర్స్ తెలిపారు.
Xiaomi 13T ప్రో ఫీచర్స్:
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 లేదా తాజా ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయి.
డిస్ప్లే: 2K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7- అంగుళాల OLED డిస్ప్లేని కలిగి ఉండవచ్చు.
కెమెరా: ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చు, ప్రధాన కెమెరా 108Mpతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
బ్యాటరీ: 5000mAh బ్యాటరీ మరియు 120W వరకు ఫాస్ట్ చార్జింగ్కు మద్దతు ఉండవచ్చు.
ఆపరేటింగ్ సిస్టమ్: తాజా MIUI 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter