Realme 10 Pro Plus: వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రియల్ మీ బడ్జెట్ ధరల్లో ఫోన్లను విడుదల చేస్తుంది. గతవారం లాంచ్ అయిన ఫోన్లో బడ్జెట్ గల ఫోన్ అయినా రియల్ మీ 10 ప్రో ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ప్రో వేరియంట్ లో రియల్ మీ రెండు రకాల వేరియన్లను వినియోగదారులకు పరిచయం చేసింది ఒకటి ప్రోవా అయితే మరొకటి ప్రో ప్లస్.. అయితే ఈ ఫోన్ గత వారమే చైనా మార్కెట్లో విడుదలయ్యింది. ఈ విడుదలతో చైనా మార్కెట్లో రియల్ మీ 10 ప్రో విచ్చలవిడిగా అమ్ముడుపోయింది. దాదాపు రియల్ మీ 10 ప్రో లక్ష యూనిట్లు విక్రయించింది. ఇంతగా ఈ ఫోన్ అమ్ముడు అవ్వడానికి కారణాలేంటో వినియోదారులకు ఎందుకు అంత నచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్ మీ 10 ప్రో ర్యామ్ అండ్ స్టోరేజ్:
రియల్ మీ 10 ప్రో రియల్ మీ 10 ప్రో ప్లస్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్‌లలో విక్రయిస్తున్నాయి. రియల్ మీ 9 ప్రో ప్లస్ విషయానికొస్తే మార్కెట్లో ఎంత సేల్ అయిందో తెలిసిందే.. ఈ రెండు మొబైల్స్ ఇప్పుడు రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి 8GB + 256GB, రెండవది 12GB + 256GB. ఇక రియల్ మీ 10 ప్రో ప్లస్ విషయానికొస్తే ఇది కూడా రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఇది కర్వ్డ్ డిస్‌ప్లేతో వినియోగదారులకు లభిస్తోంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 1080 SoCతో అప్‌గ్రేడ్‌తో అందుబాటులో ఉంటుంది.
Realme 10 Pro స్పెసిఫికేషన్‌లు:
రియల్‌మీ 10 ప్రో సిరీస్ భారత్‌తో సహా పలు దేశాల్లో లాంచ్ అవుతోందని సమాచారం. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ 6.7-అంగుళాల స్క్రీన్ అమార్చారు. Realme 10 Pro+ OLED ప్యానెల్, ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు సమాచారం.
Realme 10 Pro సిరీస్ కెమెరా:
ఇక కెమెరా విషయానికొస్తే రెండు మోడళ్లకు ఒకే కెమెరా సెటప్ కలిగి ఉంది. 108MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో మార్కెట్‌లోకి లాంచ్ కానుంది. Pro+ వేరియంట్‌లో 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది.
Realme 10 Pro సిరీస్ బ్యాటరీ:
Realme 10 Proలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఇక ప్లస్ వేరియంట్‌లో 67W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ యూనిట్ అందుబాటులో ఉంటుంది.
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook