Realme Neo 7 Se Price In India: ప్రస్తుతం ప్రీమియం చిప్‌సెట్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే డైమెన్సిటీ 8400-అల్ట్రా పవర్డ్‌తో కూడిన మొబైల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ చిప్‌సెట్‌పు సంబంధించిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ కాబోతోంది. ఇది అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఏంటో? ఎప్పుడు లాంచ్ కాబోతుందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ డైమెన్సిటీ 8400-అల్ట్రా పవర్డ్ చిప్‌సెటప్ కలిగి మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ రియల్ మీ బ్రాండ్ నుంచి విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ Realme Neo 7 SE పేరుతో లాంచ్ కాబోతోంది. ఈ మొబైల్ 7,000mAh బ్యాటరీను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అతి తక్కువ ధరలో భారత్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రారంభ ధర 2,199 యువాన్(చైనా కరెన్సీలో) ఉండగా.. భారత్‌లో ధర రూ.25,829 ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌తో మరో స్మార్ట్‌ఫోన్ కూడా అందుబాటులోకి రాబోతోంది. ఇది Neo 7 SE పేరుతో విడుదల కానుంది.
ఈ Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్‌ను 2025లో ఫిబ్రవరి నెలలో చైనాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌ను Realme GT Neo 6 SE మొబైల్‌కి సక్సెసర్‌గా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్లో Realme GT 7T స్మార్ట్‌ఫోన్‌గా రీబ్యాడ్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌లో కనిపించేందుకు ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం
ఈ Realme Neo 7 SE మొబైల్‌కు సంబంధించిన డిస్ల్పే వివరాల్లోకి వెళితే.. ఇది 6.67-అంగుళాల డిస్ల్పేతో విడుదల కానుంది. అలాగే ఈ డిస్ల్పే AMOLED 1.5K 120Hz సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ 16 GB ర్యామ్‌తో పాటు 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల కాబోతోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు బ్యాక్ సెటప్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌లను కలిగి ఉంటుంది.
Also Read: New Year Prabhas: న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌కు డార్లింగ్ ప్రభాస్ వీడియో సందేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook