Realme P2 Pro 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ మార్కెట్‌లోకి కొత్త కొత్త మొబైల్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అతి తక్కువ ధరల్లో అత్యధునిక టెక్నాలజీతో కూడిన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కావడంతో చాలా మంది యువత వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో మీరు కూడా రియల్ మీలో మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనికి సంబంధించిన మొదటి సేల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఆరంభం కాబోతోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్స్ ప్రత్యేకమైన ఆఫర్స్‌తో లభించబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ప్రస్తుతం రియల్ మీ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్స్‌తో పాటు రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. ఇక రెండవ వేరియంట్ 256 GB స్టోరేజ్, చివరి వేరియంట్ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే దీని ధర MRP రూ.25,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనిని మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభించనుంది.
డిస్కౌంట్ ఆఫర్స్:
realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ మొదటి స్టోరేజ్ వేరియంట్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమైన తగ్గింపును అందించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దీని అసలు ధర రూ.25,999 కాగా మొదటి సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 15 శాతం ప్రత్యేకమైన తగ్గింపుతో కేవలం రూ.21,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాల్లోకి వెళితే, దీనిని ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఫీచర్స్, స్పెఫికేషన్స్:
MediaTek Dimensity 8200-U 5G ప్రాసెసర్
6.7-inch AMOLED డిస్ప్లే
Full HD+ రెజల్యూషన్
120Hz రిఫ్రెష్ రేటు సపోర్ట్
6GB/8GB RAM, 128GB/256GB స్టోరేజ్
microSD కార్డ్ స్లాట్ సపోర్ట్
5000mAh బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్
64MP ప్రైమరీ సెన్సార్ రియర్ కెమెరా
8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా
2MP మాక్రో సెన్సార్ కెమెరా
16MP సెల్ఫీ కెమెరా
Android 13, Realme UI 4.0 ఆపరేటింగ్ సిస్టమ్
5G, 4G LTE, Wi-Fi, Bluetooth, GPS, USB-C కనెక్టివిటీలు
ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్
IP53 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.