Royal Enfield Shotgun 650 Limited Edition Price: ప్రముఖ మోటర్‌సైకిల్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్‌లోకి అద్భుతమైన మోటర్‌సైకిల్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 మోటర్‌సైకిల్‌ను కొత్త ఎడిషన్‌తో లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ బైక్‌ను కేవలం 100 యూనిట్లను మాత్రమే తయారు చేసినట్లు వెల్లడించింది. ఇది గత మోటర్‌సైకిల్ డిజైన్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ బైక్ రేస్‌తో కూడిన ప్రత్యేకమైన గ్రాఫిక్స్ స్టిక్కర్స్‌ను అందిస్తోంది. అలాగే అద్భుతమైన ట్రిపుల్-టోన్ పెయింట్ స్కీమ్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని రిమ్స్ స్పెషల్ గోల్డ్ కోటింగ్‌తో వస్తోంది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ లోగోను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇందులో సీట్లు ఎరుపు రంగులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన బార్-ఎండ్ మిర్రర్లు కూడా లభిస్తున్నాయి. ఇక దీని ధర రూ.4.25 లక్షలుగా ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ (Royal Enfield Shotgun 650 Limited Edition) మోటర్‌సైకిల్‌ను భారత్లో కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే దీనిని కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ముందుగానే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. దీని లోగో చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్‌కు సంబంధించిన మైలేజీ వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ షాట్‌గన్ 650 ఎడిషన్ మోటర్‌సైకిల్ (Royal Enfield Shotgun 650 Limited Edition)ను భారత కస్టమర్స్ కూడా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే కంపెనీ ఈ అప్లికేషన్ ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభించింది. ఈ బైక్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు నేరుగా RE యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మోటర్‌సైకిల్స్‌ను కంపెనీ ప్రతి ప్రాంతానికి 25 యూనిట్లు మాత్రమే కేటించినట్లు వెల్లడించింది. ఇక దీనికి సంబంధించిన బుకింగ్ విండో ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ బైక్ అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కానుంది. ఇది 648cc ప్యారలల్-ట్విన్ ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే ప్రత్యేకమైన 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది.
Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి