Samsung Galaxy F14 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy F14 5G మొబైల్‌పై ఏకంగా రూ.11,900 తగ్గింపు..ధర వివరాలు ఇవే!

Samsung Galaxy F14 5G Price: అతి తక్కువ ధరలోనే సాంసంగ్‌ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని బిగ్ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 21, 2023, 12:49 PM IST
Samsung Galaxy F14 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో SAMSUNG Galaxy F14 5G మొబైల్‌పై ఏకంగా రూ.11,900 తగ్గింపు..ధర వివరాలు ఇవే!

Samsung Galaxy F14 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్‌ పరికరాలు అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరలో లభిస్తున్నాయి. అతి చౌకగా మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ బంఫర్‌ ఆఫర్స్‌తో సాంసంగ్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ను విక్రయిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ సేల్‌లో భాగంగా ఏయే స్మార్ట్ ఫోన్స్‌పై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న బిగ్ ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా సాంసంగ్‌ ఇటీవలే విడుదల చేసిన Galaxy F14 5G స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర MRP రూ. 18,490కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 32 శాతం తగ్గింపుతో కేవలం రూ.12,490కే లభిస్తోంది. దీంతో పాటు అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

బ్యాంక్‌ ఆఫర్స్‌:
ఈ SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ ఫోన్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి ఫెడరల్‌ బ్యాంక్‌(Federal Bank)క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు IDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కూడా అదనపు తగ్గింపును పొందవచ్చు. ఈ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే వన్‌ కార్డ్‌ క్రెడిట్ కార్డ్‌తో కూడా దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్‌ ఆఫర్స్‌ అన్ని పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ కేవలం రూ.10,490కే పొందవచ్చు. 

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

ఎక్చేంజ్‌ ఆఫర్‌:

ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే డెడ్‌ చీప్‌గా పొందవచ్చు. ఈ SAMSUNG Galaxy F14 5G స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు రూ.11,900 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ కొత్త మొబైల్‌ను కేవలం రూ.590కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ అనేది పాత స్మార్ట్ ఫోన్‌ బ్రాండ్‌, కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.  

Also read: Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, కేరళ, తెలంగాణలో పెరుగుతున్న కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News