Samsung Galaxy M34 5G Price in India: 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ M34 5G పేరిట రానున్న ఈ ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఫోన్ లాంచింగ్ కంటే ముందుగానే లీక్ అయ్యాయి. జూలై ఆరంభంలో ఇండియాలో లాంచ్ కాబోతున్న ఈ ఫోన్ ఖరీదు కూడా రూ. 20,000 లోపే ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తక్కువ వెలుతురులోనూ క్రిష్టల్ క్లియర్ ఫోటోలు, వీడియోలు తీసుకునేలా 50MP కెమెరా, 120Hz రిఫ్రెష్ రేటుతో సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్ లో 6000 mAh బ్యాటరీని అమర్చినట్టు తెలుస్తోంది.
ఇకపై రాబోయేది ఫెస్టివల్స్ సీజనే కావడంతో ఈ పండుగ సీజన్‌ని లక్ష్యంగా చేసుకుని దక్షిణ కొరియా కంపెనీ అయిన శాంసంగ్ ఈ మిడ్-సెగ్మెంట్ ఫోన్ ని ఇండియాలో లాంచ్ చేస్తున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ సెగ్మెంట్ లో ప్రీమియం ఫీచర్స్ తో వస్తోన్న ఫోన్ కావడంతో యువత ఈ ఫోన్ పట్ల ఎక్కువ ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయి అని శాంసంగ్ కంపెనీ ధీమా వ్యక్తంచేసింది.
ప్రయాణంలోనూ పర్‌ఫెక్ట్ వీడియోలు తీసుకోవచ్చు అని శాంసంగ్ వెల్లడించింది. 2019లో శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ లాంచ్ అవగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో ఎన్నో ఫోన్స్ మార్కెట్లోకి వచ్చాయి. అంతేకాకుండా శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఫోన్స్ సింహభాగంలో ఉన్నాయి. ఇండియాలో అత్యధికంగా 5G ఫోన్స్ విక్రయించిన కంపెనీల జాబితాలో శాంసంగ్ టాప్ ప్లేస్‌కి దూసుకుపోవడానికి శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్ ఆ కంపెనీకి ఎంతగానో ఉపయోగపడుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook