Samsung Galaxy M05: 50MP కెమేరాతో శాంసంగ్ ఫోన్ కేవలం 8 వేలకే

Samsung Galaxy M05: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో ఫోన్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో అతి తక్కువ ధరకే ఈ ఫోన్ లభించనుంది. బడ్జెట్ ఫోన్ విభాగంలో శాంసంగ్ ఈ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 14, 2024, 11:45 AM IST
Samsung Galaxy M05: 50MP కెమేరాతో శాంసంగ్ ఫోన్ కేవలం 8 వేలకే

Samsung Galaxy M05: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ కంపెనీదే మేజర్ వాటా. బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్ల వరకూ అద్భుతమైన ఫీచర్లతో ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తుంటుంది. ఇదే క్రమంలో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. 50 మెగాపిక్సెల్ కెమేరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిన ఈ ఫోన్ కేవలం 8 వేలకే లభ్యం కానుంది. ఆ వివరాలు మీ కోసం.

శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన బెస్ట్ ఫీచర్డ్ బడ్జెట్ ఫోన్ Samsung Galaxy M05.4జి నెట్‌వర్క్ సపోర్ట్ చేసే ఈ ఫోన్ 6.74 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ హీలియో జి85 ప్రోసెసర్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో సిమ్ ఏర్పాటుతో వస్తోంది. మైక్రో ఎస్డీ కార్డు ఉపయోగించి 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తూ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌తో పాటు రెండేళ్లు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఆప్‌డేట్స్, నాలుగేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉంటాయి. 

ప్రస్తుతం ఇందులో ఒక వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ఉపయోగించి స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచవచ్చు. మింట్ గ్రీన్ రంగులో దొరుకుతోంది. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇక కెమేరా పరంగా అయితే మెయిన్ కెమేరా ఏకంగా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ఇక సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. కేవలం 8 వేలకే ఇన్ని ఫీచర్లు కలిగిన శాంసంగ్ ఫోన్ లభ్యం కావడం విశేషమే. 

Also read: Monkey Pox Vaccine: మంకీపాక్స్ వ్యాక్సిన్ వచ్చేసింది, రెండు డోసులతో 82 శాతం ప్రభావం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News