Sony Wf-c500 Price Drop In India: మార్కెట్లో రోజురోజుకీ స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగిపోతోంది అంతేకాకుండా వీటితోపాటు ఎలక్ట్రిక్ పరికరాల వినియోగం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది దీన్ని దృష్టిలో పెట్టుకొని టెక్ కంపెనీలు కొత్త కొత్త పరికరాలను తయారు చేస్తూ విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇయర్ బర్డ్స్ తో పాటు ఇయర్ సెట్స్‌కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది చాలామంది యువత వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటితో పాటు టెక్ కంపెనీలు స్మార్ట్ వాచ్ లను కూడా ఎక్కువగా విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఇయర్ బడ్స్ విషయానికొస్తే చాలామంది ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన వాటిని ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అందులో అతి తక్కువ ధరలు కలిగిన వాటిని విచ్చలవిడిగా కుంటున్నారు. మీరు కూడా ఎప్పటినుంచో మంచి ఇయర్ బడ్స్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఫ్లిఫ్‌కార్ట్ ఆఫర్ మీకోసమే..
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ సేల్‌కి ముందే ప్రత్యేక ఆఫర్స్ తో కస్టమర్స్ ని టెంప్ట్ చేస్తోంది. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్స్‌తో పాటు ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీ లపై అత్యధికమైన తగ్గింపు ధరతో విక్రయిస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్రీమియం బ్రాండ్స్‌కు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ ఇయర్ బడ్స్‌ను ఈ సంవత్సరంలో ఎప్పుడూ అందించలేని డిస్కౌంట్తో విక్రయిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇటీవలే లాంచ్ అయిన SONY WF-C500 ఇయర్ బడ్స్ అత్యధిక డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసే వారికి అద్భుతమైన కూఫన్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ SONY WF-C500 ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 8,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 50% తగ్గింపుతో కేవలం రూ.4, 450కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేసే వారు భారీ డిస్కౌంట్‌లో పొందవచ్చు. ఈ ఇయర్ బర్డ్స్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే దీనిని కొనుగోలు చేసే క్రమంలో అన్ని బ్యాంకులకు సంబంధించిన డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1600 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో బ్యాంక్ ఆఫర్స్ అన్నీ పోను దీనిని కేవలం రూ.2,990కే పొందవచ్చు.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
DSEE HD హై రెసల్యూషన్ సౌండ్
3D ఆడియో అనుభవం
360 Reality ఆడియో
హెవీ బాస్
20 గంటల ప్లేబ్యాక్
10 నిమిషాల ఛార్జ్‌తో 60 నిమిషాల ప్లేబ్యాక్
ఎర్గనామిక్ డిజైన్
సరిపోయే రబ్బర్ టిప్‌లు
IPX4 స్ప్లాష్-ప్రూఫ్
Hands-free కాల్‌లు
Google Assistant
Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.