VIVO V40 Series Launch: 12జీబీ ర్యామ్, 50MP మూడు కెమేరాలతో వివో కొత్త ఫోన్లు లాంచ్ ధర ఎంతంటే

VIVO V40 Series Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో  మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా, ఆకర్షణీయమైన డిజైన్‌తో వివో లాంచ్ చాసిన ఫోన్ మార్కెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 7, 2024, 06:33 PM IST
VIVO V40 Series Launch: 12జీబీ ర్యామ్, 50MP మూడు కెమేరాలతో వివో కొత్త ఫోన్లు లాంచ్ ధర ఎంతంటే

VIVO V40 Series Launch: VIVO కొత్తగా VIVO V40 సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. అద్భుతమైన కెమేరా రిజల్యూషన్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో పాటు ఆకట్టుకునే డిజైన్ ఈ ఫోన్ సొంతం. భారత మార్కెట్‌లో ఇవాళ లాంచ్ అయిన ఈ ఫోన్‌పై అంచనాలు పెద్దఎత్తున ఉన్నాయి. ఇందులో VIVO V40 ప్రో కూడా ఉంది. 

VIVO V40 సిరీస్ ఫోన్ 6.78 అంగుళాల పుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌‌ప్లే కలిగి ఉండి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. 4500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 3 చిప్‌సెట్ ప్రోసెసర్ ఉంటుంది. అంతేకాకుండా 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇక కెమేరా అయితే వేరే పూర్తిగా ప్రత్యేకం. వెనుక వైపు Zeiss బ్రాండ్ డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పనిచేస్తాయి. ప్రైమరీ కెమేరా 50 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ కెమేరా 50 మెగాపిక్సెల్ కాగా సెల్ఫీ  కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక ఇందులోనే VIVO V40 ప్రో సిరీస్ ఫోన్ అయితే 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9200 ప్లస్ చిప్‌సెట్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. 

ఈ ఫోన్ వెనుకవైపు  Zeiss బ్రాండెడ్ ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. ఇవి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమేరా, 50 మెగాపిక్సెల్ డిజిటల్ జూమ్ కెమేరా కలిగి ఉంది. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం అదనంగా మరో 50 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. 

ఈ రెండు ఫోన్లు 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఉంటాయి. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సోపర్ట్ చేస్తాయి. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక ధర విషయంలో వివో వి 40 సిరీస్ ఫోన్ 8జీబి ర్యామ్-128 జీబీ స్టోరేజ్ అయితే 34,999 రూపాయలుంది. ఇందులోనే 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 36,999 రూపాయలుగా ఉంది. అదే 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 41,999 రూపాయలుంది. 

ఇక వివో వి 40 ప్రో అయితే 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ధర 49,999 రూపాయలుంగా ఉంది. ఇందులోనే 12జీబీ ర్యామ్-512 జీబీ స్టోరేజ్ అయితే 55,999 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ప్రీ బుకింగ్స్ నడుస్తున్నాయి. ఆగస్టు 13, 19 తేదీల నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. 

Also read: Flying Kites on August 15: పంద్రాగస్టున గాలిపటాలు ఎందుకు ఎగురవేస్తారు, దీని వెనుక ఉన్న కధేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News