Vivo V29e Features: స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజం వివో కంపెనీ నుండి వివో V29E ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. " అద్భుతమైన ఫీచర్స్, డిజైన్‌తో రూపొందిన వివో V29E టెక్నాలజీ అంటే ఇష్టపడే స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కి పర్‌ఫెక్ట్ మ్యాచ్ " అని వివో చెబుతోంది. మిడ్‌రేంజ్ ప్రీమియం ఫోన్ల విభాగంలో వివో V29e మిగతా ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుంది అని వివో బలంగా నమ్ముతోంది. అద్భుతమైన అమోల్డ్ డిస్‌ప్లే నుండి మొదలుకుని శక్తివంతమైన ప్రాసెసర్ వరకు వివో V29E ఫోన్ ఎక్కడా రాజీ లేని అనుభవాన్ని అందించనుంది అని వివో కంపెనీ ధీమా వ్యక్తంచేస్తోంది.
తమ స్మార్ట్‌ఫోన్స్‌లో పర్‌ఫార్మెన్స్‌తో పాటు స్టైల్ కూడా కోరుకునే టెక్నాలజీ ప్రియులే లక్ష్యంగా వివో కంపెనీ వివో V29E ఫోన్‌ని లాంచ్ చేసింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగాన్ 695 ప్రాసెసర్ ఆధారంగా నడిచే వివో V29e ఫోన్‌లో 8GB RAM తో పాటు 128 GB , 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ ఉన్నాయి. డిజిటల్ లైఫ్, మల్టీ టాస్కింగ్ ఎంజాయ్ చేసే వారికి వివో V29e ఫోన్ సరిగ్గా సూట్ అవుతుంది అని వివో కంపెనీ తమ ప్రకటనలో వెల్లడించింది. అలాగే నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్మెంట్ కోసం 5000 mAh బ్యాటరీని అమర్చారు.
వివో V29e స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రధానమైన ఫీచర్స్ :
వివో V29e డిస్ ప్లే :
వివో V29e 2400 × 1080 (FHD+) రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను ఉపయోగించారు. తద్వారా ఈ స్క్రీన్‌పై విజువల్స్ అద్భుతంగా ప్రజెంట్ చేస్తుంది.
వివో V29e కెమెరా :
ఇంతకు ముందు ఏ ఫోన్‌లో లేని విధంగా అందమైన సెల్ఫీల కోసం ముందు భాగంలో 50MP కెమెరాను అమర్చారు. అలాగే వెనుక భాగంలో 64MP మెయిన్ లెన్స్, 8MP వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌ని ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేసేందుకు వివో V29e కెమెరా సెటప్ ఉపయోగపడనుంది.
వివో V29e ఆపరేటింగ్ సిస్టమ్ :
ఫన్‌టచ్ OS 13 గ్లోబల్ ఆధారంగా రన్ అయ్యే వివో V29e ఫోన్ ఎంతో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ అందిస్తోంది.
ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 FE: శాంసంగ్ గెలాక్సీ S23 FE ఫీచర్స్ లీక్
వివో V29e ప్రీబుకింగ్ :
వివో V29e ని సొంతం చేసుకోవాలనుకునే వారు వివో అధికారిక వెబ్‌సైట్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో వివో V29e ని ప్రీబుక్ చేసుకోవచ్చు. త్వరగా ఆర్డర్ చేసే వారికి ఎట్రాక్టివ్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వర్తించనున్నట్టు వివో కంపెనీ స్పష్టంచేసింది.
ఇది కూడా చదవండి : Cars Launching In September 2023: ఈ సెప్టెంబర్‌లో లాంచ్ అవుతున్న కొత్త కార్లు, వాటి ఫీచర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి