Volkswagen ID. 2all Ev: వోక్స్‌వ్యాగన్ నుంచి ఛీప్‌ ధరకే EV కారు.. అబ్బబ్బా ఫీచర్స్‌ భలే ఉన్నాయ్..

Volkswagen ID. 2all Ev Price: భారత మార్కెట్‌లోకి వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ID. 2all (Volkswagen ID. 2all) లాంచ్‌ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 10, 2025, 02:34 PM IST
Volkswagen ID. 2all Ev: వోక్స్‌వ్యాగన్ నుంచి ఛీప్‌ ధరకే EV కారు.. అబ్బబ్బా ఫీచర్స్‌ భలే ఉన్నాయ్..

Volkswagen ID. 2all Ev Price: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ వోక్స్‌వ్యాగన్ తమ కస్టమర్స్‌కి గుడ్‌ న్యూస్‌ తెలపబోతోంది. అద్భుతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. ఇది ప్రీమియం లుక్‌తో పాటు ఊహించని మైలేజీతో అందుబాటులోకి రానుంది. గతంలో విడుదల చేసిన కార్లు భారత మార్కెట్‌లో మంచి ప్రజాదరణ లభించడం వల్ల ఈ కారును లాంచ్‌ చేసినట్లు తెలిపింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ఈ వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ID. 2all (Volkswagen ID. 2all) అనే పేరుతో విడుదల కాబోతోంది. కంపెనీ ఈ కారును 2027 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ EV కారు ధర సుమారు రూ. 18 లక్షలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కారు అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ మోడల్ ఎలక్ట్రిక్ కారు గతంలో విడుదల చేసిన కార్ల కంటే అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు  మాడ్యులర్ ఎలక్ట్రిక్ డ్రైవ్ (MEB) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ కారు వచ్చే ఏడాదిలోపు మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నట్లు మార్కెట్‌లో టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే ఈ వోక్స్‌వ్యాగన్ కారు మార్కెట్‌లో గతంలో ఓ మోడల్ కారు దాదాపు 500,000 యూనిట్లకు పైగా విక్రయించిన్నట్లు సమాచారం. ఈ కారు మార్కెట్‌లోకి విడుదలైతే టాప్‌ బ్రాండ్‌లకు సంబంధించి కార్లతో పోటీపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

ఇక ఈ వోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 400 నుంచి 500 కీలోమీటర్ల వరకు మైలేజీని అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కారులోని లోపలి భాగం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రీమియం లెదర్‌ సీటింగ్‌తో రానుంది. అంతేకాకుండా శక్తివంతమైన ఇంజన్‌ కూడా కలిగి ఉండబోతున్నట్లు మార్కెట్‌లో టాక్‌ నడుస్తోంది. అలాగే ఇది మార్కెట్‌లోకి వివిధ రకాల కలర్‌ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. 

Also read; 8th Pay Commission Salary Hike: ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతున్నాయి. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News