Whatsapp New Feature: ప్రముఖ సోషల్ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోవడం, నిలబెట్టుకోవడం చేస్తోంది. ఇప్పుడు మరో కొత్త ఫీచర్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇదే వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్‌క్రిప్షన్. ఈ ఫీచర్ సహాయంతో మీ వాయిస్‌ను టెక్ట్స్ కింద మార్చుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
వాట్సప్ యూజర్లకు మెటా నుంచి మరో అద్భుతమైన ఫీచర్ ఇది. అదే వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్‌క్రిప్షన్. వాట్సప్ అనేది ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే చాటింగ్ యాప్. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతుంటుంది. అందులో భాగంగానే వాట్సప్ ఇటీవల ఈ వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ అందుబాటులో తీసుకొచ్చింది. దీనిద్వారా యుజర్లు తమ వాయిస్‌ను టెక్స్ట్ మెస్సేజ్‌లో మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ఇటీవలే ప్రారంభమైంది. చాలా సులభంగా వాయిస్ ద్వారా టెక్స్ట్ కన్వర్షన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వాయిస్ మెస్సేజ్ ఆప్షన్ ద్వారా చాటింగ్ నడుస్తోంది. కానీ అదే వాయిస్ మెస్సేజ్‌ను టెక్స్ట్‌లో మార్చుకుంటే యూజర్లకు మరింత సులభంగా ఉంటుంది. సౌకర్యవంతంగా ఉంటుంది.
ఎందుకంటే ఎక్కడైనా రద్దీ ఉండే ప్రదేశాల్లో ఉన్నప్పుడు లేదా ప్రైవసీగా లేనప్పుడు వాయిస్ మెస్సేజ్ వినడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్ అద్బుతంగా ఉపయోగపడుతుంది.
వాట్సప్ వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఎలా వినియోగించవచ్చు
మీ ఫోన్‌లో జనరేట్ అయిన ట్రాన్స్‌క్రిప్షన్లను ఇతరులు ఆఖరికి వాట్సప్ కూడా వినేందుకు సాధ్యం కాదు. ఈ కొత్త ఫీచర్ ఉపయోగించేందుకు ముందుగా వాట్సప్ ఓపెన్ చేయాలి. ఆ తరువాత సెట్టింగ్స్-చాట్‌లో వెళ్లాలి. చాట్‌లో వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఆప్షన్ ఉంటుంది. ఇది ఆన్ చేసుకుని లాంగ్వేజ్ ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.
సెట్టింగ్స్ నుంచి చాట్ ఆ తరువాత వాయిస్ మెస్సేజ్ ట్రాన్స్‌క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి. వాయిస్ మెస్సేజ్‌పై లాంగ్ ప్రెస్ చేసి మెనూలో కన్పించే ట్రాన్స్‌క్రైబ్ ఎంచుకోవాలి. అంతే మీ వాయిస్ మెస్సేజ్ టెక్స్ట్ కింద మారుతుంది.
Also read: Bank Locker Rules: బ్యాంకు లాకర్లలో ఈ వస్తువులు ఉంచడం నిషిద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.