Trifold Phone: ప్రపంచంలో మొట్టమొదటి ట్రై ఫోల్డ్ ఫోన్, ఇండియాలో ఎప్పుడు

Trifold Phone: స్మార్ట్‌ఫోన్ రంగం రోజురోజుకూ మారిపోతోంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఫోల్డబుల్ ఫోన్స్‌కు జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త ఫోన్ వచ్చేసింది. ట్రై ఫోల్డ్ పోన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చేసింది. అద్దిరిపోయే లుక్స్, అద్భుతమైన ఫీచర్లతో  ఆకట్టుకుంటోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2025, 04:27 PM IST
Trifold Phone: ప్రపంచంలో మొట్టమొదటి ట్రై ఫోల్డ్ ఫోన్, ఇండియాలో ఎప్పుడు

Trifold Phone: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ కంపెనీ హ్యువేయ్ స్మార్ట్‌ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసి సంచలనం సృష్టించింది. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై ఫోల్డబుల్ ఫోన్ ఇది. ఇప్పటి వరకూ ఏ ఇతర కంపెనీ ట్రై ఫోల్డబుల్ ఫోన్ తీసుకురాలేదు. 

ప్రపంచంలో మొదటి సారిగా HUAWEI సంస్థ నుంచి HUAWEI MATE XT పేరుతో ట్రై ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పటి వరకూ ట్రై ఫోల్డ్ ఫోన్ ఏ కంపెనీ లాంచ్ చేయలేదు. ప్రపంచ మార్కెట్‌లో ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. చాలా క్రేజ్ కన్పిస్తోంది. ప్రస్తుతం కేవలం చైనా మార్కెట్‌లోనే అందుబాటులో ఉంది. HUAWEI MATE XT ఫోన్ అనేది ప్రస్తుతం యూఏఈ టీఆర్డీఏ సర్టిఫికేషన్‌లో ఉంది. మార్చ్ నెలలో ప్రపంచ మార్కెట్‌లో విడుదలయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ఫోన్ ట్రై ఫోల్డ్ చేసినప్పుడు 6.4 ఇంచెస్ ఓఎల్ఈడీ స్క్కీన్ కలిగి ఉంటుంది. అదే అన్ ఫోల్ట్ చేస్తే మాత్రం 7.9 అంగుళాలతో  ట్రిపుల్ స్క్రీన్ 3కే రిజల్యూషన్తో కన్పిస్తుంది. 10.2 అంగుళాల డిస్‌ప్లే వస్తుంది. అన్ ఫోల్డ్ చేస్తే 3.6 ఎంఎం మందంతో ఉంటుది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుది. దీంతోపాటు 1440 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీతో ఉంటుంది. 

ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 256 జీబీ లేదా 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్, 16 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ అయితే 5600 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వైర్‌లెస్‌ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇక కనెక్టివిటీ విషయంలో బ్లూటూత్  5.2, వైఫై సపోర్ట్ చేస్తాయి. 

HUAWEI MATE XT ట్రై ఫోల్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ధర చైనాలో 2.43 లక్షలు ఉంది. ఇందులోనే 512 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 2.59 లక్షలు ఉంది. ఇక 1టీబీ వేరియంట్ ఫోన్ అయితే 2.93 లక్షలు పలుకుతోంది. 

Also read: Delhi Election Offer: ఎన్నికల్లో ఓటేస్తే చాలు...ఇక్కడ 50 శాతం డిస్కౌంట్, ఆఫర్ మరో రెండ్రోజులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News