Yamaha Rx 100 New Model 2025: యమహా నుంచి గుడ్‌న్యూస్‌.. కొత్త RX 100 రీ లాంచ్‌.. ధర, ఫీచర్స్‌ లీక్‌!

Yamaha Rx 100 New Model 2025 Price In India: ప్రముఖ కంపెనీ యమహా నుంచి RX 100 కొత్త డిజైన్‌తో విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించి ఫీచర్స్‌, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Feb 22, 2025, 02:15 PM IST
Yamaha Rx 100 New Model 2025: యమహా నుంచి గుడ్‌న్యూస్‌.. కొత్త RX 100 రీ లాంచ్‌.. ధర, ఫీచర్స్‌ లీక్‌!

Yamaha Rx 100 New Model 2025 Price In India: ప్రస్తుతం మార్కెట్‌లో యమహా  మోటర్‌సైకిల్స్‌కి మస్త్ క్రేజ్‌ ఉంది. ఈ కంపెనీ మార్కెట్‌లోకి ఎప్పుడు స్కూటర్స్‌ను విడుదల చేసిన ప్రీమియం ఫీచర్స్‌తో రావడం మీరు గమనించవచ్చు. అయితే గతంలో యమహా కంపెనీ విడుదల చేసిన మోటర్‌సైకిల్స్‌కి మార్కెట్‌లో ఇప్పటికీ మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా యమహా RX 100 మోటర్‌సైకిల్‌ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఈ బైక్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. అయితే యమహా RX 100 బైక్‌ మోడల్‌లోనే రెట్రో మోటర్‌సైకిల్‌ను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ బైక్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

యమహా RX 100 రెట్రో మోటర్‌సైకిల్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ బైక్‌లో క్లాసీ లుక్‌ కనిపించేందుకు ప్రత్యేకమైన డిజైన్‌తో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో విడుదలైన RX 100 బైక్‌కి విడుదల కాబోయే ఈ మోటర్‌సైకిల్ ఫ్రత్యేకమైన LED హెడ్‌లైట్స్‌తో విడుదల కానుంది. దీంతో పాటు స్పెషల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది. అలాగే ప్రత్యేకమైన కొన్ని కొత్త ఫీచర్స్‌ కూడా ఉండబోతున్నాయి. 

కొత్త యమహా RX 100 మోటర్‌సైకిల్ రెట్రో-స్టైల్ మస్క్యులర్ లుక్‌తో అందుబాటులోకి రావడమే కాకుండా ఇది ఎంతో శక్తివంతమైన ఇంజన్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన మైలేజీ ఆప్షన్‌తో విడుదల కాబోతోంది. ఈ బైక్ 250cc సింగిల్-సిలిండర్‌ ఇంజన్‌తో లాంచ్‌ కాబోతోంది. అలాగే ఇది గతంలో విడుదల బైక్‌ ఫీచర్స్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన కొత్త ఫీచర్స్‌ కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో లీక్‌ అయిన ఫీచర్స్‌లో తెలుస్తోంది. 

ఈ కొత్త యమహా RX 100 రెట్రో మోటర్‌సైకిల్‌లో డ్యూయల్-ఛానల్ ABSను కూడా అందిస్తోంది. అంతేకాకుండా మోనో-షాక్ సస్పెన్షన్, అల్లాయ్ వీల్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెటప్‌తో పాటు అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. యమహా RX 100 మోటర్‌సైకిల్‌కి సంబంధించిన లాంచింగ్‌ తేది వివరాల్లోకి వెళితే.. ఇది 2026 సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీని ధర రూ.1.45 లక్షలు ఉండే అవకాశాలు ఉన్నాయి.

Read more: Ar Rahman: రెహమాన్ దంపతులు మళ్లీ కలిసి పోతున్నారా..?.. వైరల్‌గా మారిన మాజీ భార్య పోస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News