Telangana Corona Update: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,697 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1825 మందికి వైరస్ పాజిటివ్ గా (Corona cases in Telangana) నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,95,855కి చేరింది. వైరస్ తో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,043 చేరింది. తాజాగా కరోనా నుంచి 351 మంది కోలుకున్నారు. మెుత్తం ఇప్పటి వరకు 6,76,817 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,995 కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో 1042 కేసులు వెలుగుచూశాయి.
దేశంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,79,723 మంది వైరస్ (Corona Cases in India) బారిన పడ్డారు. కరోనా మహమ్మారి ధాటికి మరో 146 మంది మృతి చెందారు. మరోవైపు 46,569 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 13.29 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 7,23,619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే 29,60,975 డోసులు అందించారు.
టీకా సమయం పెంపు!
మరోవైపు, టీకా పంపిణీ సమయాన్ని (COVID 19 vaccination timing) రాత్రి 10 గంటల వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. టీకా కోసం ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వైద్య శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ మనోహర్ అజ్ఞాని తెలిపారు. టీకా కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook