హైదరాబాద్: తెలంగాణలో ఏప్రిల్ 13, సోమవారం నాడు రాత్రి 10 గంటల వరకు కొత్తగా 61 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించగా, మరొకరు కరోనాతో మృతి చెందినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం నేటి 61 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 592కి చేరింది. కాగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 472గా ఉంది. తెలంగాణలో ఇప్పటివరకు 103 మంది వ్యాధి నయమై ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.. కరోనాతో మొత్తం 17 మంది చనిపోయారు. ఈమేరకు సోమవారం రాత్రి 10 గంటలకు తెలంగాణ సర్కార్ ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
61 new #Coronavirus positive cases and 1 death was reported in Telangana today. The total number of active cases in the state rises to 472, death toll stands at 17. A total of 103 people cured/discharged: Director of Public Health & Family Welfare, Government of Telangana pic.twitter.com/AvGSx4zxT1
— ANI (@ANI) April 13, 2020
తెలంగాణలో కొత్తగా 61 కరోనా కేసులు, ఒకరి మృతి