Suicide due to unemployment: తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాశాడంటే..

Unemployed youth committed suicide: గత కొంతకాలంగా తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం (Telangana govt).. ఇప్పటివరకూ నోటిఫికేషన్లు ఇవ్వలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2021, 04:46 PM IST
  • దుబ్బాక మున్సిపాలిటీలో నిరుద్యోగి ఆత్మహత్య
    ఎక్కడా జాబ్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపం
    పొలం గట్టు వద్ద చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం
    ఆత్మహత్యకు ముందు సోదరుడికి లొకేషన్ షేర్ చేసిన యువకుడు
Suicide due to unemployment: తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏం రాశాడంటే..

Unemployed youth committed suicide: తెలంగాణలో మరో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువకుడు ఉరేసుకుని చనిపోయాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకి చెందిన పెంజర్ల రాకేశ్ యాదవ్(22) డిగ్రీతో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు (Lab technician course) పూర్తి చేశాడు. కొన్నాళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.

ఆదివారం(నవంబర్ 7) సాయంత్రం తమ పొలం గట్టు వద్దకు వెళ్లిన రాకేష్.. అక్కడే ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు, తన సెల్‌ఫోన్ నుంచి సోదరుడు నాగరాజుకు లొకేషన్ షేర్ (Sharing location on whatsapp) చేశాడు. దీంతో రాకేష్‌ కోసం పొలం గట్టు వద్దకు వెళ్లిన నాగరాజు చెట్టుకు వేలాడుతున్న సోదరుడిని చూసి షాక్ తిన్నాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. 

రాకేష్ ధరించిన చొక్కా జేబులో ఒక చీటీని (Suicide note) గుర్తించారు. అందులో 'నాకు ఉద్యోగం రాలేదు... నాన్న అన్నలు జాగ్రత్త... అమ్మ పైలం...' అని రాసి ఉంది. రాకేష్ మృతితో అతని తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also read : Etela Rajender News: ఈటల రాజేందర్ కు షాక్.. అసైన్డ్ భూముల వ్యవహారంలో మరోసారి నోటీసులు

మూడు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలం పుప్పాల్‌గూడలో మహ్మద్‌ అజాజ్‌ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా చందంపేట మండలం గువ్వలగుట్ట గ్రామంలో నరేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రాకపోవడంతోనే తాము బలవన్మరణానికి (Suicide) పాల్పడుతున్నట్టుగా ఈ ఇద్దరూ తమ సూసైడ్ నోట్స్‌లో పేర్కొన్నారు. 

గత కొంతకాలంగా తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో 50వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించిన టీఆర్ఎస్ ప్రభుత్వం (Telangana govt).. ఇప్పటివరకూ నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల సమయంలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు (Job notifications) ఇస్తామని చెప్పడం... ఆ తర్వాత దాన్ని అటకెక్కించడం ప్రభుత్వానికి అలవాటైపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై సీరియస్‌గా ఫోకస్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

Also read : Bandi Sanjay Fire on KCR: సీఎం కేసీఆర్​ చెప్పేవన్నీ అబద్ధాలే: ఎంపీ బండి సంజయ్​

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News