Back To BRS Party: మళ్లీ కేసీఆర్ చెంతకు 'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు'.. త్వరలోనే ముహూర్తం?

Two MLAs Ready To Rejoins Into BRS Party: బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్‌ అయినా ఎమ్మెల్యేలు డైలామాలో పడ్డారా..! తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ఆ ఇద్దరు నేతలు ప్రయత్నిస్తున్నారా..! అందుకే తమ ఇళ్లలో కేసీఆర్‌ ఫొటోను తీసేందుకు నిరాక తీసేయలేదని చెబుతున్నారా..! కారెక్కే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారా..! ఇంతకీ ఆ ఎమ్మెల్యేల దారెటు!

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 7, 2025, 02:40 PM IST
Back To BRS Party: మళ్లీ కేసీఆర్ చెంతకు 'ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు'.. త్వరలోనే ముహూర్తం?

BRS Party Rejoinings: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పరేషాన్‌ అవుతున్నట్టు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ నోటీసుతో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. కొద్దిరోజుల క్రితం కారు దిగి హస్తం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్‌, గూడెం మహిపాల్‌ రెడ్డి తిరిగి కారెక్కేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్‌ పార్టీలో చేరి తప్పుచేశామా అని లోలోన తెగ మదనపడుతున్నారట. అధికార పార్టీలో చేరి నాలుగు రాళ్లు వెనుకేసుకుందామని భావిస్తే.. చివరకు తమ ఎమ్మెల్యే పదవులకే ఎసరు వచ్చిందని బాధపడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ  స్పీకర్‌ తమపై అనర్హత వేటు వేస్తే పరిస్థితుల గురించి ఊహించుకుని టెన్షన్‌ పడుతున్నారట. ఇదే జరిగితే మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పనిసరి అవుతాయి. అలా జరిగితే ఉప ఎన్నికల్లో గెలుస్తామో.. ఓడతామో అని నేతలు తెగ పరేషాన్‌ అవుతున్నారట. అందుకే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గులాబీ పాట పడేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

Also Read: Jagadish Reddy: '14 నెలలు గడుస్తున్నా.. కేసీఆర్ మీద ఇంకా రేవంత్‌ రెడ్డి ఏడుపా?'

తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్‌ చేశారు. తన ఇంట్లో వైఎస్సార్ , కేసీఆర్ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. అయితే ఇంట్లో లీడర్ల ఫోటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ.. సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటో పెట్టుకోకుండా.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ పెట్టుకోవడం ఏంటని ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా కేసీఆర్‌పై వల్లమాలిన అభిమానం చూపిస్తుండటంతో దానంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

మరోవైపు రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా కూల్చివేతల్ని దానం నాగేందర్ అడ్డుకుంటున్నారు. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్‌ను భోలా శంకరుడు అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. ఇటీవల అసెంబ్లీలో నోరుజారిన దానం.. ఆ తర్వాత కేటీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి క్షమపణ కోరినట్టు చెప్పుకొచ్చారు. అయితే అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నేతల్ని పొగడటంతో.. దానం చూపు తిరిగి బీఆర్‌ఎస్‌ వైపు మళ్లిందనే చర్చ జరుగుతోంది.

Also Read: Teenmaar Mallanna: 'పార్టీ టికెట్‌పై ఎమ్మెల్సీగా గెలిచావ్‌ గుర్తుంచుకో'.. తీన్మార్‌ మల్లన్నకు షోకాజ్‌ నోటీస్‌

మరోవైపు పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డిదే ఇదే పరిస్థితి అని చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినా గూడెం మహిపాల్ రెడ్డి.. ఆ తర్వాత అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో గూడెం చేరాక.. పఠాన్‌చెరులో మూడు గ్రూపులు ఆరు పంచాయితీలుగా సీన్ మారిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెంను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు.

|ఇటీవల పఠాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మాజీ సీఎం కేసీఆర్‌ పెట్టుకోవడంతో కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో కాకుండా.. కేసీఆర్ ఫొటో ఎలా పెట్టుకుంటావంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దాంతో పఠాన్‌చెరులో గూడెం వర్సెస్‌ కాటాగా సీన్‌ మారిపోయింది. చివరకు ఇద్దరు నేతల్ని గాంధీభవన్‌కు పిలిచి తలంటినా.. గూడెం మహిపాల్ రెడ్డి తగ్గేదేలేదంటున్నారని సమాచారం.

తాజాగా పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలక స్పీకర్ నోటీసులు పంపించారు. పార్టీ ఫిరాయించడంపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే స్పీకర్‌ నుంచి ఊహించని నోటీసుతో ఖంగుతున్న ఎమ్మెల్యేలు..తిరిగి గులాబీ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అలా చేస్తే.. ఉప ఎన్నికల టెన్షన్ నుంచి తప్పించుకోవచ్చు.. అని ఆలోచిస్తున్నారట. అందుకే బ్యాక్ టు ఫెవిలియన్‌ అన్నట్టుగా కేసీఆర్‌ జపం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ఇద్దరు లీడర్లు చేరికను గులాబీ బాస్‌ కేసీఆర్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఫొటోను తీసేందుకు ఆసక్తిగా లేరని సమాచారం. మొత్తంగా గూడెం మహిపాల్‌ రెడ్డి, దానం నాగేందర్‌ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. పార్టీకి ఇబ్బందులు కలిగించే ప్రసంగాలు చేస్తున్న వీరిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News