Numaish Parking danda: భాగ్య నగరంలో నిజాముల కాలం నుంచి ఎగ్జిమిషన్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఒకప్పుడు అంతా బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్కడ పార్కింగ్ దందాతో పాటు అన్ని విషయాల్లో అవినీతి రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే ఎగ్జిబిషన్ అంతా అస్తవస్త్యం అయిందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంట్రీ ఫీజు 50 రూపాయలు ఉందని అక్కడికి వస్తున్న ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎంట్రీ ఫీజుకు రెండింతలు పార్కింగ్ దానికి రెండింతలు ఉందని కోపం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. పార్కింగ్ గూండాల ఆగడాలను అరికట్టాలన్నారు. 45 రోజులపాటు జరిగే ఎగ్జిబిషన్ వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎగ్జిబిషన్ వల్ల నాంపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అక్కడ నుంచి ప్రయాణం సాగించే వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఎగ్జిబిషన్‌ను సిటీకి బయట 100 ఎకరాల్లో పెట్టాలన్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఎగ్జిబిషన్‌ను షిఫ్ట్ చేయాలన్నారు. అపుడు ఎగ్జిబిషన్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. ప్రస్తుత జమానాలో అందరు ఆన్ లైన్ లోనే షాపింగ్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో పని గట్టుకొని ఎక్కువ డబ్బులు పెట్టి ఈ తతంగం అంతా అవసరమా అనే ఆలోచన ప్రజల్లో మొదలైందన్నారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.