MLC Kavitha: కేసీఆర్ ఐఫోన్‌.. రేవంత్ రెడ్డి చైనా ఫోన్‌.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్

MLC Kavitha Comments on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని చైనా ఫోన్‌తో పోల్చారు ఎమ్మెల్సీ కవిత. చైనా ఫోన్ చూసేందుకు బానే ఉంటుందని.. కానీ సరిగా పనిచేయదన్నారు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.    

Written by - Ashok Krindinti | Last Updated : Feb 10, 2025, 12:05 PM IST
MLC Kavitha: కేసీఆర్ ఐఫోన్‌.. రేవంత్ రెడ్డి చైనా ఫోన్‌.. ఎమ్మెల్సీ కవిత కౌంటర్

MLC Kavitha Comments on CM Revanth Reddy: కేసీఆర్ పాలన ఐఫోన్‌లా ఉంటే.. రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్‌లా ఉందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. జగిత్యాలలో ఆమె మాట్లాడుతూ.. ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటదో.. కేసీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందన్నారు. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుందని.. కానీ సరిగ్గా పనిచేయదన్నారు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకుని సీఎం రేవంత్ రెడ్డి బూరడి కొట్టారని అన్నారు. ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారో లెక్కలు ఎందుకు  బయటపెట్టడం లేదు..? అని ప్రశ్నించారు. తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని విమర్శించారు.

"స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదు..? బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలి. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలి. తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోంది. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలి. 52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారు. కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోంది.

బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయం. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవపట్టించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదు..? 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది. ఎండిపోయిన పొలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారు. ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి. కేసీఆర్‌పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులను నీళ్లించే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి.

ఆడపిల్లలు స్కూటీలు, మహిళలకు 2500 ఏమయ్యాయి..? మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్ది చెబుతారు. అర్హులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలి. రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదు..? రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరారు. అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది" అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Also Read: Kiran Royal illegal Affairs: జనసేన నేత కిరణ్ రాయల్ భాగోతాలు త్వరలో సస్పెన్షన్ వేటు

Also Read: Tirumala: తిరుమల భక్తులకు అలెర్ట్.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల  సమయం..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News