KCR Teacher: ఏ స్థాయిలో ఉన్నా ఎలాంటి బేషజాలు లేకుండా కేసీఆర్ తనకు బోధించిన గురువులను గౌరవిస్తుంటారు. ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా తనకు బోధించిన వారిని పాదాభివందనం చేసి గౌరవించుకుంటారు. ఇదే కేసీఆర్‌లో ఉన్న గొప్పతనం. తాజాగా మాజీ ముఖ్యమంత్రి అలాగే చేశారు. తనకు ఇంటర్మీడియట్‌లో బోధన చేసిన గురువును గుర్తు చేసుకుని మరి కలిశారు.
Also Read: K Kavitha Bail: కవితకు భారీ షాక్.. రెండు బెయిల్ పిటిషన్లు తిరస్కరణ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జగిత్యాలలో పర్యటించారు. ఈ క్రమంలో సోమవారం తన చిన్ననాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య వద్దకు వెళ్లి కలిశారు. ఆయన నివాసానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా గురువు పాదాలకు నమస్కరించారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న గురువును కేసీఆర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Also Read: KTR Road Show: ఓటుకు కాకుండా టూర్లకు వెళ్లితే మీకే నష్టం.. హైదరాబాద్‌వాసులకు కేటీఆర్ హెచ్చరిక
జైశెట్టి రమణయ్య కేసీఆర్‌కు బోధన చేశారు. సిద్దిపేట జూనియర్ కళాశాలలో జెట్టి రమణయ్య చరిత్ర అధ్యాపకులుగా పని చేశారు. కేసీఆర్‌కు చరిత్ర పాఠాలు నేర్పారు. నాటి జ్ఞాపకాలను కేసీఆర్ నెమరు వేసుకున్నారు. ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఎదిగిన తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య ఎంతగానో సంబురపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్‌కు ఉన్న శ్రద్ధను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతి అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు. ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత నీదేనని తన శిష్యుడు కేసీఆర్‌ను కొనియాడారు.
సాధించిన రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అభివృద్ధి చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని దేశంలో నిలిపావని గురువు రమణయ్య మెచ్చుకున్నారు. కష్టనష్టాలు, సుఖాలను బాధలను జయాలను అపజయాలను సమ స్థితిలో స్వీకరించడం కేసీఆర్‌కు చిన్ననాటి నుంచి అలవాటేనని పేర్కొన్నారు. అదే కేసీఆర్ విజయాలకు మూలమని, అదే స్థిత ప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లు తూడ్చడంలో ముందుండాలని కేసీఆర్‌కు సూచించారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉన్నదని కేసీఆర్‌కు రమణయ్య ఉద్భోదించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter