KCR HOT COMMENTS: వరంగల్ పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ములుగు రోడుల్లో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. తర్వాత అక్కడే జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు కేసీఆర్. పూల బొకేలాంటి దేశంలో కొందరు దుర్మార్గులు తమ స్వార్థ, నీచ రాజకీయాల కోసం విష బీజాలు నాటుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. తన వయసు 68 సంవత్సరాలు అని.. ఇక మా కాలం అయిపోయిందని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్ మొత్తం విద్యార్థులదేనని, యువత అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.
తన కాలం అయిపోయిందంటూ కేసీఆర్ చేసిన ప్రకటనపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. కొంత కాలంగా దేశ రాజకీయాలపై ఫోకస్ చేసిన కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 5 విజయదశమి రోజున కొత్త పార్టీని అధికారికంగా కేసీఆర్ ప్రకటిస్తారని టీఆర్ఎస్ వర్గాల నుంచే సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో తన కాలం అయిపోయిందంటూ వరంగల్ సభలో కేసీఆర్ చేసిన ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నాను కాబట్టి తెలంగాణలో ఇక తన కాలం అయిపోయిందనే అర్ధం వచ్చేలా కేసీఆర్ కామెంట్ చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయని.. వరంగల్ సభలో కేసీఆర్ పరోక్షంగా ఆ సంకేతం ఇచ్చారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. తెలంగాణలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ కాళేశ్వరంలోనూ భారీగా అక్రమాలు జరిగాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో కేంద్ర దర్యాప్థు సంస్థలు ఏమైనా సంచలనాలు చేయబోతున్నాయా అన్న ప్రచారం సాగుతోంది. ఈ కోణంలో కేసీఆర్ ఏమైనా ఈ ప్రకటన చేశారా అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు జాతీయ పార్టీ ప్రకటన తర్వాత తెలంగాణ రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకుంటారనే చర్చ కూడా సాగుతోంది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించనున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
Also Read : KTR VS KISHAN REDDY: నీలాంటి చెత్త కేంద్ర మంత్రిని ఇంతవరకు చూడలేదు.. కిషన్ రెడ్డిని ఏకిపారేసిన కేటీఆర్
Also Read : Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి