COVID-19 cases in Telangana: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గముఖం పడుతున్నాయి. శుక్రవారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,707 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఎప్పటిలాగే యధావిధిగా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయమలో రాష్ట్రవ్యాప్తంగా 16 మంది కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య మొత్తం 3,456 కి పెరిగింది.
Also read: Bank Timings In Telangana: లాక్డౌన్లో తెలంగాణ బ్యాంకుల పనివేళలు మారాయి, కొత్త టైమింగ్స్ ఇవే
ఇప్పటివరకు 5,74,103 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 22,759 కరోనా యాక్టివ్ కేసులు (COVID-19 cases in telangana) ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు.
Also read : HMRL timings, TSRTC timings: మెట్రో రైళ్లు, టిఎస్ఆర్టీసీ టైమింగ్స్‌లో మార్పులు
Also read : Special Trains From Secunderabad: నేటి నుంచి 4 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రారంభం, వాటి Timings
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook