Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?

Telangana Govt Released One DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం డీఏ విడుదల చేసింది. ఎంత పెరిగింది? ఎప్పటి నుంచి వర్తిస్తుందో వంటి వివరాలు ఇవే.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Oct 30, 2024, 07:58 PM IST
Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?

Telangana DA: తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఒకే ఒక డీఏను విడుదల చేసింది. దీపావళి పండుగకు ముందు రోజు విడుదల చేసిన డీఏ పెంపుపై ఉద్యోగ వర్గాలకు సంతృప్తి లేదు. రెండు డీఏలు ఇస్తానని చెప్పి మోసం చేసి ప్రభుత్వం ఒకటే ఒక డీఏ ఇచ్చిందని ఉద్యోగ కుటుంబాలు మదన పడుతున్నాయి. 3.64 శాతం డీఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పండుగ ముందు దీపావళి కానుకగా విడుదల చేసిన డీఏపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.

Also Read: Harish Rao: రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

 

ప్రభుత్వం విడుదల చేసిన డీఏ పెంపు ఉత్తర్వుల్లో కీలక అంశాలు ఉన్నాయి. డీఏ పెంపు అనేది 2022 జూలై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబర్‌ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2022 జూలై ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు ఉన్న డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలో జమ కానున్నాయి. డీఏ పెంపుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇది దీపావళి కానుకగా చెబుతోంది.

Also Read: Padi Kaushik Reddy: 'రేవంత్ రెడ్డి 10 నెలల పాలనపై ప్రజలు ఛీ ఛీ.. థూ థూ అంటుండ్రు'

 

కాగా ప్రభుత్వ ఉద్యోగులను ఊరించి ఊరించి చివరకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చేలా కూడా చేయలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా ఉద్యోగులకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. డీఏలపై ఉద్యమానికి సిద్ధమైన ప్రభుత్వ ఉద్యోగులతో రేవంత్‌ రెడ్డి సమావేశమై చర్చించింది. రెండు డీఏలకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ తర్వాత జరిగిన మంత్రివర్గం సమావేశంలో మాత్రం ఒకటే డీఏకు ఆమోదం తెలిపింది. రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని చెబుతూ ఒక్క డీఏకు ఆమోదం తెలపడంతో ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

కొన్నేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏలకు మోక్షం లభించకపోవడంతో ఉద్యోగులు ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఐదు డీఏల్లో రెండు డీఏలు వస్తాయని భారీ ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం త్వరలోనే పోరాటానికి ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పటికే జేఏసీగా ఏర్పడిన ఉద్యోగ సంఘాలు దీపావళి పండుగ తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఉద్యమం చేపట్టే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News