దళిత బంధును వ్యతిరేకిస్తే సహించం: ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్

Dalita Bandhu scheme is good for dalits: Vangapally Srinivas: యాదాద్రి భువనగిరి: దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకం ఒక అద్భుతమైన సంక్షేమ పథకం అని ఎమ్మార్పీఎస్-టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ కొనియాడారు. ఇకనైనా దళితుల బతుకులు బాగుపడాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాన్ని దళితులం సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2021, 08:46 AM IST
దళిత బంధును వ్యతిరేకిస్తే సహించం: ఎమ్మార్పీఎస్ నేత వంగపల్లి శ్రీనివాస్

Dalita Bandhu scheme is good for dalits: Vangapally Srinivas: యాదాద్రి భువనగిరి: దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న దళిత బంధు పథకం ఒక అద్భుతమైన సంక్షేమ పథకం అని ఎమ్మార్పీఎస్-టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరులో గురువారం విలేకరులతో మాట్లాడిన వంగపల్లి శ్రీనివాస్.. ఇకనైనా దళితుల బతుకులు బాగుపడాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తీసుకున్న నిర్ణయాన్ని దళితులం సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని అన్నారు. 

Also read : దళిత బంధు పథకంపై, సీఎం కేసీఆర్‌పై మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు

దళిత కుటుంబం ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ చేస్తానని చెప్పి దళితుల పట్ల, వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఇలాంటి సమయంలో దళిత బంధు పథకాన్ని ఏ దళిత నాయకుడు వ్యతిరేకించినా సహించబోమని వంగపల్లి శ్రీనివాస్ స్పష్టంచేశారు. అవసరమైతే దళిత బంధును (Dalit bandhu scheme) విమర్శించే వారిపై తిరుగుబాటు చేయడానికైనా వెనకడుగు వేయబోమని ఆయన హెచ్చరించారు.

Also read : Etela Rajender: చిన్నోళ్లమా.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గుద్దుడు గుద్దుతరు: KCR కి ఈటల కౌంటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News