KCR: మళ్లీ ఫామ్‌లోకి కేసీఆర్.. ఫామ్‌హౌస్‌ వేదికగా రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం

Ex CM KCR Reentry: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వైఫల్య పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 31, 2025, 06:50 PM IST
KCR: మళ్లీ ఫామ్‌లోకి కేసీఆర్.. ఫామ్‌హౌస్‌ వేదికగా రేవంత్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం

KCR Speech: రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగా అమలు కావడం లేదని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలనలో పథకాలన్నీ గంగలో కలిశాయని ఆరోపించారు. కరోనా సమయంలో కూడా తాను రైతుబంధు ఆపలేదని కేసీఆర్ గుర్తు చేస్తూ పరిస్థితులు బాగా ఉన్నా కూడా పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. తమ హయాంలో అమలు చేసిన రైతుబీమాతో ఎంతో మందికి మేలు జరిగిందని గుర్తు చేశారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెప్పి రాబోయేది తమ విజయమని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: Retirement Age: ఉద్యోగులపై పేలిన భారీ బాంబు.. 65 ఏళ్లకు పెరిగిన రిటైర్మెంట్‌ వయస్సు

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కోహీర్, జహీరాబాద్, ఝారసంఘం, మొగుడాంపల్లి మండలాలకు చెందిన గులాబీ పార్టీ పాల్గొన్నారు ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను గంభీరంగా.. మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టటం నాకు ఉన్న అలవాటు' అని పేర్కొన్నారు.

Also Read: Yadadri Temple: తిరుమల త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట అభివృద్ధి.. త్వరలోనే బోర్డు నియామకం?

ఈ సందర్భంగా తన యాక్టీవ్ పాలిటిక్స్ పై కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. 'ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ ఉంటుంది' అని ప్రకటించారు. ఎక్కడి ప్రాజెక్ట్ లు అక్కడే పడుకున్నాయని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. సంగమేశ్వరం , బసవేశ్వరం, కాళేశ్వరం అన్ని ఎండబెడుతున్నారని గులాబీ అధినేత కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News