Harish Rao Fires on CM Revanth Reddy: ఢిల్లీలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందిరాపార్క్ వద్ద ఆర్ఎంపీ, పీఎంపీల ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో ఆర్‌ఎంపీలకు పోలీస్ కేసు లేవు దాడులు లేవని.. అన్యాయంగా జైల్లో పెట్టిన పరిస్థితి లేదని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తరువాత వారికి నిద్ర పట్టలేదని.. ఏ రాత్రి వేళ వచ్చి పోలీస్ కేసులు పెట్టి వారిని జీపులో వేసి ఊరంతా తిప్పుతుందని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. ఆర్‌ఎంపీలకు ట్రైనింగ్ ఇచ్చి.. సర్టిఫికెట్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్ఎంపీల మీద కేసులు పెట్టి కనీసం ఉన్న బతుకుదెరువు లేకుండా పిల్లలకు దూరం చేస్తున్న పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తక్షిణమే అధికారులకు ఆదేశాలు ఇచ్చి వేధించకుండా చూడాలి. అక్రమ కేసులు పెట్టకుండా చూడాలి. వీళ్లకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించాలి. మీ ట్రైనింగ్ కొనసాగించాలని డాక్టర్ లక్ష్మారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చారు. ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ఆర్‌ఎంపీలను స్టేషన్ల చుట్టూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా తిప్పలేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఇబ్బంది వస్తే మీ సంఘ ప్రతినిధులు నా దృష్టికి తెస్తే అర గంటలో మీ సమస్య పరిష్కారం చేశాం. అంతే తప్ప మిమ్మల్ని ఎక్కడ కూడా వేధించాలేదు.
మా గీత కార్మికుల పొట్ట కొడుతున్నారు అని చెప్పి గౌడ్ అన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు. ఏ ఒక్క హామీ అయినా అమలు చేశావా రేవంత్..? మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలేదు. వృద్ధులకు ఇచ్చే నాలుగు వేల పింఛన్ కూడా అమలుగాలే.. ఈ నెలలో ఎంపీటీసీ ఎలక్షన్ పెడతారంట.. అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి.. ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటి ఆయుధం.. రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి.. మీ ఆర్‌ఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్లను అసెంబ్లీలో ప్రశ్నిస్తా.. నిలదీస్తా.. మీ తరఫున పోరాటం చేస్తా...
పెట్టిన కేసులు ఎన్ని ఎత్తివేయాలి. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి. మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తెండి. మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీకు రక్షణ కవచంలాగా నిలబడి మిమ్మల్ని కాపాడుకుంటాం. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. ఐక్యంగా పోరాడండి.. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది.." అని హరీష్ రావు అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter