Munugode Bypoll: తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న ప్రధాన పార్టీలు.. ఇందుకోసం వక్రమార్గాలు కూడా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవడమే లక్ష్యంగా అడ్డదారులు తొక్కుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా దొంగ ఓట్ల అంశం తెరపైకి వచ్చింది. అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య రగడకు కారణమైంది.
మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓటర్ల వివాదం ముదురుతోంది. గత రెండు నెలల్లోనే నియోజకవర్గం పరిధిలో దాదాపు 25 వేల కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఇదే ఇప్పుడు రచ్చగా మారింది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవంటున్నారు. ఏ నియోజకవర్గంలో అయినా ఐదేళ్లకొకసారి జరిగే ఎన్నికల్లో దాదాపు 10 వేల ఓట్లు పెరుగుతుంటాయి. కాని మునుగోడుకు సంబంధించి గత రెండు నెలల్లోనే ఏకంగా 25 వేల కొత్త దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేస్తారనే ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. ఉప ఎన్నిక వస్తుందని ముందుగానే అప్రమత్తమైన కొన్ని పార్టీలు భారీగా కొత్త ఓటర్లను చేర్చించారని తెలుస్తోంది. ఉప ఎన్నిక వస్తే డబ్బులు భారీగా ఇస్తారనే ఆశతో కొందరు ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు మునుగోడులో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారనే టాక్ నడుస్తోంది.
ఇక అధికార పార్టీ భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించిందని బీజేపీ ఆరోపిస్తోంది. మునుగోడులో గెలుపు కష్టమని ముందే గ్రహించిన గులాబీ పార్టీ నేతలు.. ఇలా దొంగ ఓటర్లతో దరఖాస్తు చేయించారని చెబుతోంది. మునుగోడులో అధికార పార్టీ కుట్ర పూరితంగా దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఈసీకి ఫిర్యాదు చేసింది. దొంగ ఓటర్ల విషయంలో న్యాయపోరాటానికి దిగింది కమలం పార్టీ. మునుగోడులో కొత్త ఓటర్ల జాబితా ప్రకటనపై స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించింది. కేవలం రెండు నెలల్లో సుమారు 25వేల కొత్త ఓటర్ల దరఖాస్తులను ఎన్నికల సంఘం స్వీకరించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితాను ఈనెల 14న ఈసీ ప్రకటించనుంది. అయితే కొత్త ఓటర్ల జాబితాపై స్టే విధించాలని కోరింది బీజేపీ. జూలై 31 వరకు ఉన్న ఓటర్ల జాబితాతోనే ఉపఎన్నిక నిర్వహించాలని కోరుతోంది. బీజేపీ వేసిన పిటిషన్ పై హైకోర్టులో ఈనెల 13న విచారణ జరగనుంది.
Also Read : Munugode Bypoll: డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి! మునుగోడులో మార్మోగుతున్న నినాదం
Also Read : సిల్లీ కారణంతో.. జిమ్‌లో జట్టు పట్టుకుని తన్నుకున్న మహిళలు! వీడియో చూస్తే నవ్వులే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి