Harish Rao: రేవంత్‌ పాలనలో 36 మంది విద్యార్థుల బలి.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే

Revanth Reddy Kills 36 Students In Residential Schools: అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ కుంటుపడిందని.. ఇప్పటివరకు 36 మంది విద్యార్థులు చనిపోయారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలేనని ప్రకటించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 5, 2024, 03:39 PM IST
Harish Rao: రేవంత్‌ పాలనలో 36 మంది విద్యార్థుల బలి.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే

Wankidi Residential School: గురుకులాల్లో దారుణ పరిస్థితులతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్నా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో చలనం లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. విద్యా శాఖ మంత్రి లేని రేవంత్‌ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతోందని తెలిపారు. ఇప్పటివరకు 36 మంది విద్యార్థులు మృతి చెందారని.. అవి ప్రభుత్వం చేసిన హత్యలుగా పేర్కొన్నారు. వెంటనే కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి విద్యావ్యవస్థపై సమీక్ష చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: KTR Letter: రాహుల్‌ గాంధీకి కేటీఆర్‌ సంచలన లేఖ.. క్షమాపణ చెప్పాకే తెలంగాణలోకి రావాలని ఛాలెంజ్‌

 

ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. కొన్ని రోజులు గడిచినా వారి పరిస్థితి మెరుగు కాకపోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్పందించి స్వయంగా డబ్బులు ఇచ్చి హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంగళవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు హరీశ్‌ రావు పరామర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంతరం వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు.

Also Read: Local Body Elections: స్థానిక ఎన్నికలపై రేవంత్‌ ముందడుగు.. బీసీ రిజర్వేషన్లకు డెడికేషన్‌ కమిషన్‌

 

అనంతరం మీడియాతో మాజీ మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. వాంకిడి గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల తల్లితండ్రుల నమ్మకాన్ని పోగొట్టేలా ప్రభుత్వ గురుకులాల్లో పరిస్థితులు దిగజారాయని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనలో రేవంత్‌ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని వరుస సంఘటనలు చెబుతున్నాయని వివరించారు. ఇప్పటివరకు గురుకుల పాఠశాలల్లో 36 మంది విద్యార్ధులు వివిధ కారణాలతో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి, మంత్రులు మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల బిజీలో ఉంటే గురుకులాలను పట్టించుకునే వారెవర ఉన్నారు? అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. 'కేసీఆర్ హయాంలో 1,023 ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్‌ తన పాలనలో ప్రతి విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షా 20 వేలు వెచ్చించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గురుకుల విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు, పైలట్‌లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు.. ఎవరెస్టుతో పాటు ప్రపంచం లో ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉన్న పర్వత శిఖరాలను అధిరోహించారు' అని వివరించారు.

'కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఎవరెస్టు స్థాయికి పెంచితే.. రేవంత్ రెడ్డి ఎలుకలు విద్యార్థులను కరిచే స్థాయికి తీసుకుపోయారు అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. గురుకులాలకు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారని మండిపడ్డారు. రాజకీయాల జోలికి పోకుండా ప్రభుత్వ గురుకుల పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News