Revanth Reddy Revenge Politics: 'రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో రాజకీయ కుట్రలో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారు. కేటీఆర్‌తో సహా కౌశిక్ రెడ్డిపై అక్రమ కేసులు పెడుతున్నారు. ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని పగ.. ప్రతీకారంతో.. కుట్రతో చేస్తున్నది తప్ప మరొకటి కాదు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తమకు న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉందని తెలిపారు. కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు.
Also Read: BJP Group Politics: బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ దోస్తీ.. బీజేపీలో సద్దుమణిగిన వర్గపోరు
పాడి కౌశిక్ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో హైదరాబాద్ కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.'డీజీపీ జితేందర్ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదు. బెయిలబుల్ సెక్షన్స్‌లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం. ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలి' అని హరీశ్ రావు హితవు పలికారు.
Also Read: Turmeric Board: పసుపు రైతులకు 'సంక్రాంతి' కానుక.. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం
సుప్రీంకోర్టును పట్టించుకోరా?
'బెయిలబుల్ కేసులు అని తెలిసి రాత్రంతా ఇబ్బంది పెట్టారు. బెయిలబుల్ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. కానీ కావాలని పండుగ పూట ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు చేయడం దుర్మార్గం. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో ఎలా వ్యవహరించాలో పోలీసులకు దిశానిర్దేశం చేయాలని డీజీపీకి సూచిస్తున్నా' అని హరీశ్ రావు తెలిపారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పండుగ అని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలని సూచిస్తున్నట్లు చెప్పారు.
మీరు పెట్టినవే కదా?
'కౌశిక్ రెడ్డి మీద 28 కేసులు ఉన్నాయి. అరెస్టు చేయాలని అంటున్నారు. ఎవరు పెట్టారు కేసులు. రేవంత్ రెడ్డి రాకముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కౌశిక్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించింది మీరు కాదా? 28 కేసులు మీరు పెట్టినవే కదా?' అని మాజీమంత్రి హరీశ్ రావు వివరించారు. 'కలెక్టర్ ఆహ్వానిస్తే కౌశిక్ రెడ్డి మీటింగ్‌కు వెళ్లారు. పిలువని పేరంటానికివెళ్లలేదు. నువ్వే పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని ప్రశ్నింస్తే దానిలో తప్పేముంది?' అని హరీశ్ రావు ప్రశ్నించారు.
ఏ పార్టీ వారు?
'ఒక్క కౌశిక్ రెడ్డి కాదు.. ఈ రాష్ట్ర ప్రజలందరూ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఏ పార్టీ వారు అని అడుగుతూనే ఉంటారు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. 'బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ నువ్వే పార్టీ తరుపున మాట్లాడుతున్నామని అడిగారు. ఇలా ప్రశ్నించడంలో కౌశిక్ రెడ్డి తప్పేం లేదు' అని వివరణ ఇచ్చారు. 'మీ కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా? ఒకే కేసులో మూడు ఎఫ్ఐఆర్‌లు పెట్టి.. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో పెట్టడం కక్ష సాధింపే కదా!' అని మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు.
రాష్ట్ర డీజీపీ, పోలీసులు రాజకీయ ప్రేరేపిత కేసుల్లో చట్టానికి లోబడి పని చేయాలి.
బెయిలబుల్ కేసుల్లో ప్రజా ప్రతినిధులను అర్ధరాత్రి, పండుగల పూట అరెస్ట్ చేయడం మానుకోవాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/mf3Eijx9QL
— BRS Party (@BRSparty) January 14, 2025
రేవంత్ రెడ్డి రాకముందు కౌశిక్ రెడ్డి మీద ఒక్క కేసు కూడా లేదు.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే @KaushikReddyBRS మీద పగబట్టి 28 అక్రమ కేసులు బనాయించింది కాంగ్రెస్ సర్కార్.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/fQIvLeJuLG
— BRS Party (@BRSparty) January 14, 2025
“చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంటే” అన్నట్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలంటున్నారు. చర్యలు తీసుకోవాల్సింది పార్టీ మారిన పదిమంది ఎమ్మెల్యేల పైన.
మంత్రులు, మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని బహిరంగంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ప్రకటించారు.… pic.twitter.com/KdbR5UC2lO
— BRS Party (@BRSparty) January 14, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter