ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ రూపాల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, నగలు, మధ్యం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వరకు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉంచిన రూ.140 కోట్ల నగదు, నగలు, మధ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో నగదు రూ.122 కోట్లు ఉన్నట్లు ఎన్నికల అధికారి పేర్కొన్నారు. పోలీసు శాఖ రూ.100 కోట్లు, ఐటీ శాఖ 22 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. బంజాహిల్స్ హవాలా ఆపరేటర్ నుంచి రూ.3 కోట్ల నగదు సాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వరంగల్ జిల్లాలో ఆత్మకూరులో 40 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా రూ.11 కోట్లు విలుమైన మద్యం,రూ.9 కోట్లు విలువైన బంగారు, వెండినగలు, చీరలు స్వాధీనం చేసుకున్నారు. ఈసీ కఠిన చర్యలు తీసుకుంటామని పదేపదే ప్రకటన ఇచ్చినప్పటికీ ఇంత మొత్తంలో నగదు, నగలు, మద్యం దొరకడం గమనార్హం.