Indiramma Indlu: 'ఇందిరమ్మ ఇల్లు' వచ్చిందా? లేదా? ఫోన్‌లో చెక్ చేసుకోవడం ఇలా..

How To Check Indiramma Indlu Updates In Mobile Phone: ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉండే మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, మంజూరు, ఏ దశలో ఉందనే విషయం తెలుసుకోవచ్చు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 14, 2025, 05:50 PM IST
Indiramma Indlu: 'ఇందిరమ్మ ఇల్లు' వచ్చిందా? లేదా? ఫోన్‌లో చెక్ చేసుకోవడం ఇలా..

Indiramma Indlu Updates: తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇవ్వగా.. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత ఆ హామీని అమలు చేస్తోంది. పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. గ్రామసభల ద్వారా.. ఆన్‌లైన్‌ వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించగా.. కొందరికి మంజూరయ్యాయి. అయితే ఇందిరమ్మ ఇల్లు మంజూరవగా ఏ దశలో ఉంది.. ఆర్థిక సహాయం ఎప్పుడు వస్తుంది? ఇళ్ల నిర్మాణానికి ఏం చేయాలనే దాని వివరాలు ఇలా తెలుసుకోవచ్చు.

Also Read: Harish Rao Padayatra: గులాబీ పార్టీకి పూర్వ వైభవం? 'మెతుకు సీమ'లో ట్రబుల్‌ షూటర్‌ పాదయాత్ర

ఇందిర‌మ్మ ఇండ్ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌వారు త‌మ ద‌ర‌ఖాస్తు ఏ దశలో ఉంది? ఇంటి కోసం స‌ర్వే నిర్వ‌హించారా లేదా? ఇల్లు మంజూరైందా? లేదా? వంటివి ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చు. మంజూరైన ఇల్లు ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 జాబితాలో ఉందా? అనేవి తెలుసుకోవడం చాలా సులువు. ఏ కారణం చేత ఇల్లు మంజూరు కాలేదు? అనే వివ‌రాల‌ను తెలుసుకునేలా తెలంగాణ ప్ర‌భుత్వం పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసింది.

Also Read: MLC Elections: ఎన్నికల్లో గులాబీ పార్టీ దూరం.. బీజేపీ, కాంగ్రెస్‌ల్లో 'రాజకీయం' కాక

ద‌ర‌ఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లో ఇందిరమ్మ ఇళ్ల వివరాలు తెలుసుకోవచ్చు. వ్యక్తిగత పనులు వదిలి మరి ప్రభుత్వ కార్యాల‌యాల చుట్టూ తిర‌గ‌కుండా మొబైల్ ఫోన్‌లో వివరాలు తెలుసుకునే విధానం చాలా సులువు. ఆధార్ నంబ‌ర్/ మొబైల్ నంబ‌ర్ / రేష‌న్ కార్డు నంబర్‌తో ఇందిరమ్మ అన్నివివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన https://indirammaindlu.telangana.gov.in అనే వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చు.

చెక్ చేయడం ఇలా..

  • ఇందిరమ్మ ఇల్లు వెబ్‌సైట్‌ తెరిచాక గ్రీవెన్స్ స్టేట‌స్‌ను ఎంచుకోవాలి.
  • సెర్చ్‌లోకి వెళ్లి అక్కడ ఆధార్‌/ ఫోన్‌/ రేషన్‌ కార్డు నంబర్‌ను అక్కడ పొందుపర్చాలి.
  • నంబర్‌ను పొందపర్చిన అనంతరం ద‌ర‌ఖాస్తుకు సంబంధించిన అన్ని వివ‌రాలు కనిపిస్తాయి.
  • కనిపించిన వివరాల్లో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉందో తెలుస్తుంది.
  • ద‌ర‌ఖాస్తుదారులు ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే ఈ వెబ్‌సైట్ ద్వారానే తెలపాల్సి ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News