Hyderabad metro timings revised form October 10: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. సోమవారం (అక్టోబర్ 10) నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం రాత్రి 10.15 గంటల వరకే టర్మినల్ సేషన్ల నుంచి చివరి మెట్రో ఉండేది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు రాత్రి సమయాల్లో మెట్రో అధికారులు మార్పులు చేశారు. అక్టోబర్ 10 నుంచి టర్మినల్ స్టేషన్లలో చివరి మెట్రో రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఎప్పటిలానే ఉదయం 6 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభమవుతాయి.
హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో స్వల్ప మార్పు చేసినట్టు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. 'అక్టోబర్ 10 నుంచి హైదరాబాద్ మెట్రో రైలు సర్వీస్ వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాము. రోజువారీ సర్వీసులను ఉదయం 6 గంటలకు ఆరంభిస్తాం. చివరి రైలు సంబంధిత టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రో రైలు వేళలు మార్చుతున్నాం' అని మెట్రో రైలు ఎండీ పేర్కొన్నారు.
Also Read: INDW vs PAKW: చేతులెత్తేసిన బ్యాటర్లు.. పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి!
Also Read: Sarkaru Vaari Paata TRP Rating : తక్కువ రేటింగ్.. కారణం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు!
ప్రయాణికులకు గుడ్‌న్యూస్
ఇకపై రాత్రి 11 గంటల వరకు మెట్రోలో ప్రయాణించవచ్చు
ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మెట్రో సమయాల్లో మార్పులు