Counselling To Drinkers: మంగళవారం రాత్రి 8 గంటల నుంచే రోడ్లపైకి వచ్చిన పోలీసులు బుధవారం ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మూడు కమిషనరేట్ల పరిధిలో 2,864 తాగుబోతులు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు చిక్కారు. తాగి పట్టుబడిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్బంగా నేటి నుంచి కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించి తర్వాత కోర్టులో వారిని హాజరుపరచనున్నారు.
హైదరాబాద్ మహా నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 4,500 మంది పోలీసులు స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఒక్కో చెక్ పాయింట్ వద్ద ఎస్‌ఐ సహా 10 మంది ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 550కి పైగా బ్రీత్ ఎనలైజర్స్ ఉపయోగించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో డిసెంబర్ 31న 3001 కేసులు నమోదు కాగా మంగళవారం ఒక్కరోజే 2,864 కేసులు నమోదయ్యాయి.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నలుగురికి 500 బీఏసీ లెవెల్ కంటే ఎక్కువ రాగా, రాచకొండ పరిధిలో ఒకరికి అత్యధికంగా 348 బీఏసీ వచ్చింది. డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన వారి వాహనాలను సీజ్ చేసి ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాహనం, బ్రీత్ఎనలైజర్ తో పాటు మందు తాగి వాహనాలు నడిపిన వారి ఫొటోలు తీసుకున్నారు. సీజ్ చేసిన వెహికిల్స్‌ను ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
డ్రైవర్లకు గోషామహల్, బేగంపేట్, ఎల్బీనగర్, మాదాపూర్‌లోని సెంటర్స్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. సిటీ కమిషనరేట్‌లో పట్టుబడిన 401 మందికి వారి వారి కుటుంబసభ్యులతో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల గురించి 15 నిమిషాల వీడియోను ప్రదర్శించారు. షెడ్యూల్ ప్రకారం సంబంధిత కోర్టుల్లో హాజరుకావాలని సమాచారం ఇచ్చారు.
మరోవైపు తెలంగాణ న్యాబ్ పోలీసులు డ్రగ్స్ డిటెక్షన్ తనిఖీ లు నిర్వహించారు. పబ్స్, బార్లు,ఈవెంట్స్ ఎక్కువగా జరిగిన 52 ప్రాంతాల్లో అనుమానితులను గుర్తించి టెస్ట్ చేయగా ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. మూడు కమిషనరేట్ల పరిధిలో నార్కొటిక్స్ డాగ్ స్క్వాడ్‌తో పాటు అడ్వాన్సుడ్ డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో టెస్టులు నిర్వహించారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.