Hyderabad Rains: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం... హయత్‌నగర్‌లో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం..

Hyderabad Rain Updates: హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 26, 2022, 06:38 AM IST
  • హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం
  • పలు ప్రాంతాల్లో కుండపోత
  • హయత్‌నగర్‌లో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం
Hyderabad Rains: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం... హయత్‌నగర్‌లో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం..

Hyderabad Rain Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని సౌత్, సెంట్రల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. కొత్తపేట, ఎల్బీనగర్, హయత్ నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, కోఠి, అబిడ్స్, నాంపల్లి, మలక్‌పేట, చంచల్‌గూడ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్ల పైకి భారీగా వరద నీరు 
చేరింది.

ఏయే ప్రాంతాల్లో ఎంత వర్షపాతం :

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని సౌత్ హస్తినాపురం ప్రాంతంలో 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. అంబర్‌పేటలో 8.9 సెం.మీ, సైదాబాద్‌లోని కుర్మగూడ బాయ్స్ హైస్కూల్ ప్రాంతలో 8.8 సెం.మీ, బహదూర్‌పురా ఘాన్సీ బజార్ ప్రాంతంలో 8.7 సెం.మీ, చార్మినార్‌లో 8.5 సెం.మీ, హిమాయత్‌నగర్‌ నారాయణగూడ ప్రాంతంలో 8.5 సెం.మీ నాంపల్లిలో 8.1 సెం.మీ, సరూర్ నగర్‌లో 7.7 సెం.మీ, ఆసిఫ్ నగర్‌లో 7.5 సెం.మీ, శేరిలింగంపల్లి పరిధిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 7.4 సెం.మీ,ఉప్పల్‌లో 6.5 సెం.మీ, కుత్బుల్లాపూర్‌లో 4.3 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 4.1 సెం.మీ, బండ్లగూడలో 3.8 సెం.మీ వర్షపాతం నమోదైంది.

వాతావరణ శాఖ అలర్ట్ :

ఇవాళ (జూలై 26) తెల్లవారుజామున 4 గంటలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దీని ప్రకారం వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, రంగారెడ్డి,నల్గొండ, యాదాద్రి, జనగాం, మెదక్, సిద్ధిపేట, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్ (అర్బన్, రూరల్) జిల్లాల్లో రాబోయే 3 గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 

Also Read: Kaikala Satyanarayana: మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో కైకాల సత్యనారాయణ పుట్టిన రోజు వేడుకలు..!

Also Read: Bandla Ganesh: విజయ్ దేవరకొండకు బండ్ల కౌంటర్ వెనుక ఇంత కధ ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News