Hyderabad Rave Party: 2017లో వెలుగుచూసిన టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పలువురు సినీ తారలను ఎక్సైజ్, ఈడీ అధికారులు విచారించారు. వారి నమూనాలను సైతం సేకరించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ సినీ తారలకు క్లీన్ చిట్ ఇవ్వగా.. ఈడీ రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. కేసులో సినీ తారలను మరోసారి విచారించేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
ఆ డ్రగ్స్ కేసు ప్రకంపనలు కొనసాగుతుండగానే తాజాగా బంజారాహిల్స్ రాడిసన్ హోటల్ పబ్ లో ప్రముఖులు పట్టుబడటం సంచలనంగా మారింది. మెగా కుటుంబానికి చెందిన నిహారిక పట్టుబడటం హాట్ టాపిక్‌గా మారింది. పట్టుబడిన వారిలో నిహారికతో పాటు సింగర్ , బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్, మరికొంతమంది సినీ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ఘటన టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది.
ఇళ్లకు నోటీసులు
పబ్‌లో పట్టుబడిన సినీ ప్రముఖుల పిల్లలకు నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. త్వరలో సినీ ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. రేవ్‌పార్టీలో భారీగా డ్రగ్స్, మత్తు పదార్థాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాడిసన్ పబ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తుండటం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
వరుస వివాదాల్లో మెగా డాటర్..
మెగా డాటర్ నిహారిక ఇటీవల కాలంలో వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా నిహారికకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఏ పోస్ట్ చేసిన సరే అది వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది. కొత్త సినిమాలపై కూడా అప్పుడప్పుడు తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నిహారిక పోస్ట్ చేసిన ఫోటో వివాదాస్పదమైంది. జిమ్‌లో ఉన్న ఫోటో షేర్ చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆ వీడియోపై చాలా నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఆమెపై విరుచుకుపడ్డారు. మెగా ఫ్యామిలీ పరువు తీస్తుందని మండిపడ్డారు. దీంతో నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేసింది. తాజాగా పబ్ లో ఆమె పట్టుబడటం మెగా ఫ్యామిలీని షేక్ చేస్తోంది. రాడిసన్ ఘటనపై స్పందించేందుకు సినీ ప్రముఖులు ఎవరూ ముందుకు రావడం లేదు. మెగా కుటుంబసభ్యులు కూడా ఇందుకు దూరంగా ఉన్నారు.
Also Read: Sai Pallavi Farming: కూలీగా మారిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ హీరోయిన్ - ఫొటోలు వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్