హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మునపటి హైద్రాబాద్ పోటీసులు మరింత కఠినంగా వ్యవహిస్తున్నారు. గతంలో మందలింపులతో సరిపెట్టేవారు..రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు విపరీతంగా పెరుగిపోతున్నాయి. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని మందుబాబులపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. తమ చర్యలతో దెబ్బకు మందు బాబులకు మత్తు వదిలిస్తున్నారు. ఒక్క మేల నెలలోనే 320 మంది మందు బాబులకు జైలు శిక్ష పడేలా చేశారంటే ఏ స్థాయిలో కేసులు నమోదు చేశారో అర్థం చేసుకోవచ్చు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 1,373 మంది మందు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో కేవలం 773 మంది మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. కేసులను విచారించిన న్యాయమూర్తులు 320 మందికి శిక్షను ఖరారు చేశారు. మరోవైపు జరిమానాల రూపంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగానికి రూ. 7 లక్షల 84 వేలు జమా అయ్యాయి.