TS Tenth Results Live Updates: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. వాల్యుయేషన్, కోడింగ్, డీ కోడింగ్, కంప్యూటీరికరణ అన్ని కంప్లీట్ కావడంతో అధికారులు ఆన్‌లైన్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించగా.. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలుర సంఖ్య 2,7,952 కాగా.. బాలికల సంఖ్య 2,50,433గా ఉంది. మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షా పత్రాల మూల్యాకనం 19 కేంద్రాల్లో నిర్వహించారు. ఎన్నికల సంఘం అనుమతి లభించడంతో ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.