Chiranjeevi Politics: తెలుగులో అగ్ర హీరోగా ఉన్న కొణిదెల చిరంజీవి రాజకీయ అడుగులు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశిస్తారని.. రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఎటు వైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయాలను కాంగ్రెస్ పార్టీతో ముగించారు. అయితే ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ బీజేపీ కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షమవుతున్నారు.
Also Read: Maha Kumbh Mela: మహా కుంభమేళాలో అత్యాద్భుతం.. 154 ఏళ్ల మనిషి ప్రత్యక్షం
దశాబ్దంన్నర కిందట ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చిరంజీవి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. అనంతరం తమ్ముడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ స్థాపించడంతోపాటు తెలంగాణ, ఏపీ విభజన జరగడంతో చిరు ప్రత్యక్ష రాజకీయాలకు విరామం ప్రకటించారు. రాజకీయాలను వదిలేసిన ఆయన వరుసగా సినిమలు చేస్తూ బిజీ అయిపోయాడు. దశాబ్దం తర్వాత అనూహ్యంగా మళ్లీ రాజకీయాల్లో చిరంజీవి పేరు వినిపిస్తోంది. తమ్ముడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో చిరంజీవి మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారనే చర్చ జరుగుతోంది. తమ్ముడికి మద్దతుగా వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Indiramma Indlu: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త.. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక?
గవర్నర్, ఉప రాష్ట్రపతిగా?
అయితే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు త్వరలో కీలక మలుపు తిరిగేటట్టు పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమిలో ఉన్న జనసేన పార్టీ రానున్న రోజుల్లో కీలక పరిణామాలకు కేంద్రంగా మారుతుందనే ప్రచారం జరుగుతోంది. నరేంద్ర మోదీ, అమిత్ షా 'భారీ వ్యూహం'తో ఆ పరిణామం చోటుచేసుకుంటుందని చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ సోదరుడు చిరంజీవిని బీజేపీ వాడుకుంటోంది. సంక్రాంతి సంబరాల్లో చిరంజీవి పాల్గొన్న విషయం తెలిసిందే. త్వరలో అతడికి గవర్నర్ పదవి లేదా ఉప రాష్ట్రపతి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పక్కన చిరంజీవి ప్రత్యక్షమవడం ఆసక్తికరంగా కనిపించింది.
ఎటు వైపు ఉంటాడు?
రేవంత్ రెడ్డి పక్కన చిరంజీవి కనిపించడంతో ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో చిరంజీవిని వాడుకోవచ్చని తెలుస్తోంది. ఏపీలో బీజేపీతో కొనసాగడం.. తెలంగాణలో కాంగ్రెస్‌తో సఖ్యతగా ఉండడంతో చిరంజీవి ఎటు వైపు ఉన్నారో అనేది చర్చ జరుగుతోంది. ఆయన తన పూర్వ పార్టీలో ఉన్నాడా? లేదా భవిష్యత్‌లో కీలక పరిణామాలు జరగనున్న బీజేపీతో ఉంటున్నాడా? అనేది చిరంజీవి రాజకీయ ప్రయాణం ఆసక్తికరంగా మారింది. అతడి రాజకీయ ప్రయాణం ఎటు తిరిగినా సంచలనం రేపే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.