Fact Behind MLA Raja Singh bail: తెలంగాణ బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇచ్చిందంటూ తొలుత ప్రచారం జరిగిన సంఘటన తెలిసిందే. అయితే బెయిల్ రావడం కరెక్ట్ కాదని అసలు పీడీ యాక్ట్ మీద బెయిల్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది .ఈ విషయం మీద బీజేపీ లీగల్ సెల్ కు చెందిన సీనియర్ అడ్వకేట్ ఆంటోనీ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసలు పీడీ యాక్ట్ కు బెయిల్ ఉండదని రాష్ట్ర ప్రభుత్వం రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ ను ఈరోజు హైకోర్టు ఎత్తివేసిందని తద్వారా ఆయన జైలు నుంచి విడుదల కానున్నారని చెప్పుకొచ్చారు. అయితే పీడీ యాక్ట్ ఎత్తివేస్తూనే తెలంగాణ హైకోర్టు కొన్ని షరతులు విధించిందని తెలుస్తోంది.
మూడు నెలల పాటు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదని రాజా సింగ్ ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యే సమయంలో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఆయనను రిసీవ్ చేసుకోవడానికి రావాలని ఎలాంటి ర్యాలీలు చేయడం కానీ ప్రసంగాలు చేయడం కానీ విద్వేషపూరిత మాటలు మాట్లాడడం కానీ చేయకూడదని ఆదేశించింది. మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం కానీ పోస్టులు చేయడం కానీ చేయకూడదని హైకోర్టు పేర్కొంది. ఇక హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న రాజాసింగ్ బయటకు రాబోతున్నారు.
మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని దానికి కారణం చెప్పాలని కోరుతూ బీజేపీ అధిష్టానం ఆయనకు షోకాజు నోటీసులు జారీ చేస్తూ సస్పెండ్ చేసింది. ఈ పరిణామం జరిగిన మూడు రోజులకే అంటే సెప్టెంబర్ 5వ తేదీన ఆ అభియోగంతో పాటు గతంలో అనేక కేసులు సాకుగా చూపుతూ తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద అప్పట్లో పీడీ యాక్ట్ పెట్టి చర్లపల్లి జైలుకు తరలించింది. ఇక పీడీ యాక్ట్ రద్దు కావడంతో రాజా సింగ్ త్వరలోనే జైలు నుంచి బయటకు రాబోతున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసే అంశంపై మరో రెండు మూడు రోజుల్లో బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
సరిగ్గా రెండు రోజుల క్రితమే రాజాసింగ్ భారీ ఉషాబాయి బిజెపి సెంట్రల్ ఆఫీస్ కి వచ్చి బండి సంజయ్ ని కలిసి ఈ అంశం మీద చర్చించి వెళ్లారు. సస్పెన్షన్ సమయంలోనే షోకాజ్ నోటీసు ఇవ్వగా ఉషా బాయ్ సహకారంతో ఇప్పటికే రాజాసింగ్ దానికి సంబంధించిన వివరణ పంపించారు. ఈ వివరణపై క్రమశిక్షణ సంఘం సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన విడుదలైన వెంటనే సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో మునావర్ ఫారూఖీ అనే ఒక స్టాండ్ అప్ కమెడియన్ హైదరాబాదులో షో చేయడానికి వచ్చిన సమయంలో రాజాసింగ్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహమూద్ ప్రవక్త మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఒక వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు తీవ్రమైన చర్య తీసుకున్నారు ఆయన మీద పీడి యాక్ట్ ప్రయోగించారు. అయితే హిందూ ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతున్న క్రమంలో తన అడ్డు తొలగించాలని ఈ విధంగా టీఆర్ఎస్ ఎంఐఎం కుమ్మక్కై తనమీద ఈ పీడీ యాక్ట్ పెట్టించారని రాజాసింగ్ ముందు నుంచి ఆరోపిస్తున్నారు.
Also Read: HIT 2 Teaser : ప్రభాస్ అన్నట్టు రొమాన్స్ కూడా ఉండాలి.. వాటిపై అడివి శేష్ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook