Mlc Kavitha Letter To Cbi: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ విచారణపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. మంగళవారం విచారణకు హాజరుకాలేనని స్ఫష్టం చేశారు. ఈ మేరకు ఆమె సీబీఐకి లేఖ రాశారు. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదని.. సీబీఐ వెబ్ సైట్‌లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్‌ని పరిశీలించామన్నారు. అందులో పేర్కొన్న నిందితుల జాబితాలో తన పేరు లేదని తెలిపారు. ముందే ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున మంగళవారం విచారణకు రాలేనని సీబీఐ రాసిన లేఖలో స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.
ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని ఆమె లేఖలో తెలిపారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని సీబీఐని కోరారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని అన్నారు. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు కవిత ప్రతిస్పందిస్తూ సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా దానికి స్పందించిన సీబీఐ అధికారులు.. ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్‌లో ఉందని తెలిపారు.
వెబ్‌పైట్‌లో వివరాలు చెక్ చేసిన కవిత.. నిందితుల లిస్టులో తన పేరు లేదని చెప్పారు. ఇటీవల సీబీఐ నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం డిసెంబర్ 6న విచారణకు హాజరుకాలేనని సోమవారం ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు రాశారు. తాను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని చెప్పారు కవిత. కానీ అందులో తన పేరు ఎక్కడా లేదన్నారు. ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల మంగళవారం తాను సీబీఐ అధికారులను కలుసుకోలేనని సమాచారం ఇచ్చారు. దీనిపై సీబీఐ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరుకావాలని ఇటీవల ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు పంపించింది. డిసెంబర్ 6న మంగళవారం విచారణకు హాజరుకావాలని కోరింది. అందుకు మొదట ఓకే చెప్పిన కవిత.. హైదరాబాద్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని తెలిపింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో పాటు న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత కవిత యూ టర్న్ తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కాపీ తనకు పంపించాలని కోరారు. సీబీఐ వెబ్‌సైట్‌లో ఎఫ్ఐఆర్ కాపీ చెక్ చేసిన అనంతరం తాజాగా విచారణకు రాలేనంటూ సీబీఐకి మరో లేఖ రాశారు కవిత.
Also Read: Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి
Also Read: Gujarat Election 2022: నేడే గుజరాత్‌లో రెండో దశ పోలింగ్.. ప్రధాని మోదీ, అమిత్ షా ఓటు వేసేది ఇక్కడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి