PM Modi to unveil Statue of Sri Ramanujacharya: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం (ఫిబ్రవరి 5) తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. 11వ శతాబ్దపు సాధువు, సంఘ సంస్కర్త రామానుజాచార్య సహస్రాబ్ధి వేడుకలకు ప్రధాని హాజరుకాబోతున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆహ్వానం మేరకు రామానుజాచార్య 216 అడుగుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న మోదీ ఆవిష్కరించనున్నారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరుతో పిలుస్తున్న ఈ విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఏర్పాటు చేశారు.
రామానుజాచార్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామితో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలోని పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, నటీనటులు మరియు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014లో 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దివ్య సాకేతానికి ప్రత్యేక రోడ్డు నిర్మిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విమానం ల్యాండ్ అవగానే రన్‌వే నుంచి నేరుగా మచ్చింతల్ చేరేలా రోడ్డు వేస్తున్నారు. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రహారీ గోడను కూడా కూల్చేశారు. రోడ్డు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఇక దివ్య సాకేతానికి సమీపంలో 3 హెలిప్యాడ్‌లను నిర్మించారు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో వస్తారా? లేదా హెలికాప్టర్ ద్వారా వస్తారా? అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. ప్రధానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల ప్రాంగణంలో రామానుజాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ వంటి పంచలోహాల కలయికతో రూపొందింది. ప్రపంచంలోని రెండవ ఎత్తైన విగ్రహం ఇదే. విగ్రహం కోసం రూ. 1000 కోట్లు ఖర్చు చేశారు. ఇక ఫిబ్రవరి 13న రామానుజాచార్య స్వర్ణ విగ్రహం ఉన్న లోపలి గదిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు.
Also Read: పుట్టు మచ్చలెన్ని ఉన్నాయంటూ ప్రశ్నించిన జర్నలిస్టు.. మండిపడిన 'డీజే టిల్లు' హీరోయిన్?
Also Read: Google Trending Video: జూలో ఓ వ్యక్తిపై దాడి చేసిన సింహం.. చేతిని కొరికేసి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook