SLBC: శ్రీశైలం ఎడమ టన్నెల్ మొత్తం బురదమయంగా ఉండటం, టీబీఎం యంత్రం పై భాగం కుంగిపోవడం, దాంతో పాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. శ్రీశైలం జలాశయం వైపు నుంచి 14వ కిలోమీటరు వద్ద సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం నుంచి బాధితులను కాపాడటం అత్యంత క్లిష్టంగా మారింది. సొరంగం చివరి భాగంలో పనిచేస్తుండగా పైకప్పు కూలిన సమయంలో 8 మంది ఆచూకీ కనిపించకుండా పోయింది. వీరిలో ఎవరైనా, ఏదైనా ఆసరాగా చేసుకుని సాయం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చన్న ఆశలతో సహాయక చర్యలు చేపట్టారు.
ఈ కోణంలో డ్రోన్‌తోపాటు, స్కానర్లు, నైట్ విజన్ కెమెరాలతో కూడా దళాలు ప్రయత్నించాయి. టన్నెల్ బోరింగ్ యంత్రం వద్దకు దాదాపు చేరుకున్న కొందరు రక్షణ సభ్యులు బురదలోకి దిగే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కటిక చీకటితోపాటు బురదలో కూరుకుపోయే పరిస్థితి ఉండటంతో వెనక్కు వచ్చేశారు. దూరం నుంచి బిగ్గరగా కేకలు వేస్తూ.. బాధితుల నుంచి స్పందన వస్తుందేమోనని చాలా సేపు ప్రయత్నాలు చేశారు. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందన్నది తెలియరాలేదు.
సంఘటన చోటుచేసుకున్న ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల వెనక్కు బురద, నీళ్లు ఎగదన్నాయని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే చెప్పారు. ఆ నీటిని భారీ మోటార్లు పెట్టి ఎత్తిపోస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలిస్తున్నారు. ఐదు అత్యధిక హార్స్ పవర్ ఉన్న పంపులను వినియోగిస్తున్నారు. 13.5 కిలోమీటరు వద్ద ఒక పంపును మధ్యాహ్నం అందుబాటులోకి తీసుకొచ్చారు. లోపల విద్యుత్ సరఫరా లేని చోట కూలిపోయిన ఇనుప రెయిలింగ్, రాడ్లను తొలగించేందుకు కట్టర్లు కావాల్సి వచ్చింది. సాయంత్రం తరువాత లోపల ఉన్న ఇనుప కడ్డీలను కట్ చేయడం ప్రారంభించారు. వీటన్నింటినీ తొలగిస్తేనే ప్రమాదస్థలం వరకు రక్షణ బృందాలు వెళ్లడానికి వీలవుతుందని ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
ఇక మంత్రి ఉత్తమ్ సంప్రదింపులతో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం నుంచి మూడు హెలికాప్టర్ల ద్వారా నౌకాదళం సభ్యులను ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతానికి పంపించింది. తొలుత సంఘటన ప్రాంతాన్ని హెలికాప్టర్ల నుంచే ఆ దళం పరిశీలించింది. సోమవారం వారు కూడా రంగంలోకి దిగుతారని సమాచారం. భూగర్భ గనుల్లో రక్షణ చర్యలపై అవగాహన ఉన్న సింగరేణి విపత్తు నిర్వహణ బృందం కూడా పలు పరికరాలతో చేరుకుంది. మొత్తంగా సహాయ కార్యక్రమాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ నుంచి 130 మంది, ఎస్‌డీఆర్‌ఎఫ్ నుంచి 120 మంది, ఆర్మీ నుంచి 24 మంది, సింగరేణి రెస్క్యూ టీం నుంచి 24 మంది, హైడ్రా నుంచి 24 మంది నిమగ్నమయ్యారు.
సైన్యం, ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర సిబ్బంది టార్చిలైట్ల వెలుతురులో బృందాలుగా లోనికి వెళ్తూ రక్షణ చర్యలు ప్రారంభించారు. డ్రోన్లు, స్కానర్లను ఉపయోగించి సొరంగం లోపల పరిస్థితిని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్లాయి. సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ఆదివారం పలుమార్లు మాట్లాడారు. కార్మికులను రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని అధికారులను అప్రమత్తం చేశారు. రెండోరోజు నిర్విరామంగా కొనసాగిన సహాయ చర్యలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.