Covid19 Cases: దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా సంక్రమణ పెరగడమే దీనికి కారణమని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. మరోవైపు తెలంగాణలో కూడా క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
దేశంలో గత కొద్దిరోజులుగా అంటే 3 నెలల్నించి కోవిడ్ 19 కేసులు చెప్పుకోదగ్గ పరిమాణంలో తగ్గుతున్నాయి. ఓ దశలో రోజుకు వేయి కేసులకు చేరుకున్న పరిస్థితి. అటువంటిది గత వారం రోజుల్నించి మళ్లీ స్వల్పంగా పెరుగుదల కన్పిస్తోంది. గత వారాంతానికి కోవిడ్ కేసులు 15 వేల 708 నమోదు కాగా..జూన్ 3 నాటికి ఆ సంఖ్య 21 వేలకు చేరుకుంది. అదే సమయంలో గత వారాంతంలో 0.52 శాతంగా ఉన్న వీక్లీ పాజిటివిటీ రేటు..ఇవాళ జూన్ 3 నాటికి 0.73 శాతానికి చేరుకుంది.
స్థానికంగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న కరోనా వైరస్ సంక్రమణ కారణంగా కేసుల సంఖ్య పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేశ్ భూషణ్ తెలిపారు. కరోనా మహమ్మారి నియంత్రణలో ఇప్పటి వరకూ అవలంభించిన విదానాల్లో ఏ విధమైన సడలింపు కూడదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది.
తెలంగాణలో గత వారాంతానికి కరోనా కొత్త కేసుల సంఖ్య 287 కాగా, ఇవాళ జూన్ 3 నాటికి ఆ సంఖ్య 375కు చేరుకుంది. ఇది దేశం మొత్తం కరోనా కేసుల్లో 1.78 శాతంగా ఉంది. ఇక వీక్లీ పాజిటివిటీ రేటు 0.4 నుంచి 0.5 శాతానికి పెరిగింది. కరోనా కేసుల పెరుగుదల నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం..టెస్టింగ్, క్లినికల్ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్, వైరస్ నియంత్రణ చర్యల విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచిస్తోంది.
మరోవైపు కోవిడ్ 19 నియంత్రణకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన వివిధ మార్గదర్శకాల్ని పాటించాలని సూచించింది. ముఖ్యంగా ఫైవ్ ఫోల్డ్ స్ట్రాటెజీ...టెస్ట్ , ట్రీట్, వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరింది. రాష్ట్రంలో ఇన్‌ఫ్లూయెంజా వంటి ఆరోగ్య సమస్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది. కరోనా వైరస్ సంక్రమణ పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూ నిఘా ఉంచాలని కోరింది.
Also read: Gangrape: హైదరాబాద్‌లో మరో నిర్భయ తరహా ఘటన, 17 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్, ఎమ్మెల్యే కొడుకుపై ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook