Supreme Court: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు.. స్పీకర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

BRS MLAs Defected To Congress: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలని తెలంగాణ స్పీకర్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. తగిన సమయం అంటే మీ దృష్టిలో ఎంత అని అడిగింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 31, 2025, 03:24 PM IST
Supreme Court: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు.. స్పీకర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం

BRS MLAs Defected To Congress: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలని అంటూ తెలంగాణ స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత..? ప్రశ్నించింది. శుక్రవారం సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపులపై విచారణ జరగ్గా.. ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం అడిగింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పగా.. రీజనబుల్ టైమ్ అంటే మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసే వరకా..? అని నిలదీసింది. స్పీకర్‌ను అడిగి నిర్ణయం చెపుతామని సీనియర్ న్యాయవాది ముకుల్  రోహత్గి కోర్టుకు చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

తమ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సుప్రీం కోర్టును బీఆర్ఎస్ నేతలు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ముగ్గురు ఎమ్మెల్యేల పై సుప్రీం కోర్టులో బీఆర్ఎస్ SLP వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారని.. వాళ్లపై చర్యలకు టైమ్‌ ఫ్రేమ్‌ పెట్టాలని సుప్రీంను ఆశ్రయించింది. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఆదేశించగా.. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్ సవాలు చేసింది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ నేతలు హస్తం గూటిలో ఒక్కొక్కరుగా చేరిపోయారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరితో సహా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచుకున్నారు. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ SLP దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ కనీసం నోటీసులు కూడా ఇవ్వడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. 

Also Read: Vehicle Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. బీమా లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌ బంద్ 

Also Read: Madha Gaja Raja: 12 సంవత్సరాల తర్వాత విడుదలైన మదగదరాజ.. ఎలా ఉందంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News