Telangana 10th Exams 2022 starts from Today: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే ఇంటర్ పరీక్షలు ముగియగా.. నేటి నుంచి (మే 23) పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 23న మొదలయ్యే పదో తరగతి పరీక్షలు.. జూన్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు విద్యా శాఖ అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితుల కారణంగా రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి.
ఈ ఏడాది 5 లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2861 పరీక్ష కేంద్రాలను బోర్డు అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నాలుగు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్లు, రాష్ట్రవ్యాప్తంగా 144 స్క్వాడ్లను ఏర్పాటు చేసింది. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో 70 శాతం సిలబస్‌తోనే బోర్డు అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు తగ్గించింది విద్యా శాఖ. అంతేకాకుండా ప్రశ్నల్లో ఛాయిస్ కూడా పెంచారు. మరోవైపు వేసవి కారణంగా పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎం, ఆశా ఉద్యోగి అందుబాటులో ఉంటారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలవుతుంది. అలానే పరీక్ష పూర్తయ్యేవరకు జిరాక్సు కేంద్రాలు మూసివేయనున్నారు.
విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
# తప్పనిసరిగా మాస్క్ ధరించాలి
# హాల్‌టికెట్లులేని విద్యార్ధులకు పరీక్ష హాలులోకి అనుమతి ఉండదు
# గ్రేస్ టైమ్ 5 నిమిషాలు ఉన్నా.. 9 గంటలక వరకే పరీక్ష కేంద్రానికి చేరుకోండి
# సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్ళరాదు
# ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ప్రతిపేజీపైనా హాల్‌టికెట్ నంబరు రాయాలి
# జవాబుపత్రం, అడిషనల్, బిట్, మ్యాప్ ఎక్కడా కూడా హాల్‌టికెట్ నంబరు రాయకూడదు
# జవాబుపత్రానికి జతపర్చిన ఓఎంఆర్ షీట్ తనదేనా? కాదా? చెక్ చేసుకోవాలి
Also Read: Horoscope Today May 23 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఇల్లు కొనాలని చూస్తున్న ఆ రాశుల వారికి శుభకాలం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook